బైరెడ్డికి బంపర్ ఆఫర్..జగన్ ప్లాన్ అదేనా.!

-

గత ఎన్నికల్లో వైసీపీకి పూర్తిగా అండగా నిలిచిన జిల్లాల్లో ఉమ్మడి కర్నూలు ఒకటి..జిల్లాలో 14 సీట్లు ఉంటే 14 వైసీపీ గెలుచుంది. అయితే ఈ సారి  కూడా 14 సీట్లు గెలుచుకుని క్లీన్ స్వీప్ చేయాలని జగన్ చూస్తున్నారు. కాకపోతే గత ఎన్నికల్లో పూర్తిగా వైసీపీ వేవ్ ఉంది..ఇప్పుడు అది కాస్త తగ్గుతుంది. పైగా కొందరు ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉంది. అటు టి‌డి‌పి బలపడుతుంది. ఇటీవల సర్వేల్లో జిల్లాలో 14 సీట్లలో వైసీపీ 8, టి‌డి‌పి 6 సీట్లు గెలుచుకునే ఛాన్స్ ఉందని అంటున్నారు.

అయితే ఇక్కడ టి‌డి‌పి రెండు సీట్లు గెలుచుకున్న అది వైసీపీకి ఇబ్బందే. ఇక్కడ స్వీప్ చేస్తేనే వైసీపీ సత్తా ఏంటో తెలుస్తుంది. పైగా అటు ఉత్తరాంధ్ర, కోస్తాలో టి‌డి‌పి-జనసేన ప్రభావం ఎక్కువ ఉంటుంది. అలాంటప్పుడు సీమలో ప్రతి సీటు గెలవడమే వైసీపీ టార్గెట్ గా ఉంది. అందుకే కర్నూలులో ఈ సారి కూడా స్వీప్ చేయాలి. దాని కోసం కొన్ని మార్పులు చేర్పులు చేయడానికి జగన్ సిద్ధమవుతున్నారని తెలిసింది . ఇదే క్రమంలో రాష్ట్ర స్థాయిలో వైసీపీ యువతలో మంచి క్రేజ్ ఉన్న బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి సీటు ఇచ్చే విషయంపై వైసీపీ అధిష్టానం ఆలోచన చేస్తుందని సమాచారం.

byreddy siddharth reddy

అయితే కర్నూలులో 14 సీట్లలో వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు..అటు 2 ఎంపీ సీట్లు కూడా వైసీపీకే ఉన్నాయి. దీంతో ఎవరోకరిని తప్పిస్తే గాని..బైరెడ్డికి సీటు ఇవ్వడం సాధ్యపడదు. ఇక ఈ సారి 14 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు జగన్ సీటు ఇవ్వడం కష్టం..అందులో ముగ్గురు, నలుగురు ఎమ్మెల్యేల పరిస్తితి బాగోలేదు..దీంతో వారిలో ఎవరోకరిని బైరెడ్డితో రీప్లేస్ చేస్తారని సమాచారం. బైరెడ్డి అయితే ఈజీగా గెలుస్తారనే అంచనా ఉంది. చూడాలి మరి బైరెడ్డికి సీటు దక్కుతుందో లేదో.

Read more RELATED
Recommended to you

Exit mobile version