బీజేపీలో బాబు బ్యాచ్‌కు చెక్….టీడీపీతో నో?

-

టి‌డి‌పి అధినేత చంద్రబాబు రాజకీయం దెబ్బతినడానికి బి‌జే‌పి కూడా ఒక కారణమని చెప్పాల్సిన పని లేదు. 2014 ఎన్నికల్లో బి‌జే‌పితో పొత్తు పెట్టుకుని చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. పొత్తు ఉన్నప్పుడు హోదా వద్దు అని చెప్పిన చంద్రబాబు, 2019 ఎన్నికల ముందు మాత్రం ప్రత్యేక హోదా ఇవ్వట్లేదని చెప్పి, బి‌జే‌పి నుంచి బయటకొచ్చారు. ఇక బయటకొచ్చాక చంద్రబాబు గానీ, టి‌డి‌పి నేతలు గానీ మోడీని, అమిత్ షాని ఎన్ని రకాలుగా తిట్టారో అందరికీ తెలిసిందే. అలాగే ధర్మపోరాట దీక్షలు పేరిట బాబు చేసిన రచ్చ కూడా తెలిసిందే.

chandrababu naiduఅలా రచ్చ చేసిన బాబుని బి‌జే‌పి రాజకీయంగా గట్టిగానే దెబ్బకొట్టింది. ఎంత కాదు అనుకున్న 2019 ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోవడానికి జగన్‌కు పరోక్షంగా మేలు చేసిన విషయం అందరికీ తెలిసిందే. సరే ఏం జరిగినా గణఈ చంద్రబాబు చిత్తుగా ఓడిపోయి ప్రతిపక్షానికి పరిమితమయ్యారు. అప్పటినుంచి చంద్రబాబుకు జ్ఞానోదయం అయింది.

ఆ తర్వాత నుంచి బి‌జే‌పితో జట్టు కట్టడానికి చంద్రబాబు చేయని ప్రయత్నాలు లేవు. అలాగే తన రెండు భుజాలుగా ఉన్న సుజనా చౌదరీ, సి‌ఎం రమేష్ లాంటి నాయకులని బి‌జే‌పిలోకి పంపించారు. ఇంకా పలువురు నాయకులని బి‌జే‌పిలోకి పంపారు. కానీ ఎన్ని చేసిన బి‌జే‌పి నుంచి చంద్రబాబుకు స్నేహ హస్తం అందలేదు. పైగా బి‌జే‌పిలో ఉన్న బాబు బ్యాచ్‌కు ఎక్కడకక్కడ చెక్ పడిపోతూ వచ్చింది. వారికి బి‌జే‌పి అగ్రనేతలు పెద్ద ఛాన్స్ ఇవ్వలేదు.

అందుకే బి‌జే‌పి సహకారం చంద్రబాబుకు అందలేదని చెప్పొచ్చు. అయితే నెక్స్ట్ ఎన్నికల్లో గెలవాలంటే బి‌జే‌పి సహకారం ఉండాలని బాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఇంకా బాబు అదే ప్రయత్నాలు ఉన్నట్లు తెలుస్తోంది. కానీ బి‌జే‌పి ఛాన్స్ ఇవ్వడం లేదు. తాజాగా కూడా ఒక ఉత్తరాది బి‌జే‌పి నేత కూడా విజయవాడ వచ్చి…భవిష్యత్‌లో టి‌డి‌పితో పొత్తు ఉండబోదు అని క్లారిటీ ఇచ్చేశారట. దీంతో బి‌జే‌పిలో ఉన్న బాబు బ్యాచ్‌కు గానీ, బాబుకు గానీ చెక్ పడినట్లైంది.

Read more RELATED
Recommended to you

Latest news