దండం పెట్టి అడుగుతున్నా నా మాట వినండి; కెసిఆర్

-

కరోనా పై ముందుగానే రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమిందని తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. కరీంనగర్ ఘటన తర్వాత కలెక్టర్ లతో సమావేశం అయ్యామని అన్నారు. 11 వేల మందిని ఆధీనంలోకి తీసుకున్నామని, 5,254 నిఘా వర్గాలను ఏర్పాటు చేసామని చెప్పారు. విదేశాల నుంచి రాష్ట్రానికి 20 వేల మంది వచ్చారని, వారి అందరిని నియంత్రణ లోకి తీసుకుంటామని అన్నారు. విదేశాల నుంచి ఎవరైతే వచ్చిన వాళ్ళు ఎవరైతే వాళ్లకు దండం పెట్టి అడుగుతున్నా అని వాళ్ళు కచ్చితంగా ప్రభుత్వం వద్దకు రావాలని కోరారు.దండం పెట్టి కోరుతున్నామని, దయచేసి అలసత్వం ప్రదర్శించవద్దు అని బయట తిరిగి, మిమ్మల్ని, ప్రజలను ఇబ్బంది పెట్టుకోవద్దని ఆయన కోరారు.

విదేశాల నుంచి వచ్చిన వారితోనే అసలు సమస్య అని అన్నారు. వాళ్లకు లక్షణాలు ఉన్నాయో లేదో అర్ధం కావడం లేదని కెసిఆర్ వ్యాఖ్యానించారు. బయటి నుంచి వచ్చిన వారు స్వచ్చందంగా వెళ్లి పరిక్షలు చేయించుకోవాలి అని కెసిఆర్ కోరారు. జ్వరం, జలుబు, దగ్గు ఉన్న వారు వెంటనే రిపోర్ట్ చెయ్యాలని కెసిఆర్ కోరారు. వెంటనే రిపోర్ట్ చేస్తే మీకు మీ కుటుంబానికి మంచిది అని కెసిఆర్ వ్యాఖ్యానించారు.

జబ్బు వస్తుందే ఇతర దేశాల నుంచి అని కెసిఆర్ అన్నారు. మీకు రూపాయి ఖర్చు అవ్వదని, ఆ ఖర్చు అంతా ప్రభుత్వమే పెట్టుకుంటుందని భయపడవద్దని సూచించారు. రేపు ఉదయం ఆరు గంటల నుంచి ఎల్లుండి ఉదయం ఆరు గంటల వరకు తెలంగాణా చీమ చిటుక్కుమానవద్దు అని కెసిఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణాలో ఆర్టీసి బస్సులు అన్నీ రద్దు చేస్తున్నామని ఆదేశించారు. విదేశాల నుంచి వచ్చిన వారుపై నియంత్రణ ఉందన్నారు.

విదేశాల నుంచి వచ్చిన వారు రాష్ట్రానికి చెందిన బిడ్డలే అన్నారు. కాబట్టి ప్రజలను ఇబ్బంది పెట్టవద్దు అన్నారు. ప్రతీ ఇంటికి తిరిగి ప్రభుత్వ బృందాలు గుర్తిస్తాయని అన్నారు. అప్పుడు లక్షణాలు ఉంటే ఆస్పత్రికి తరలిస్తారని అన్నారు. రేపు అన్నీ కూడా బంద్ చేసుకోవాలని కెసిఆర్ సూచించారు. విదేశాల నుంచి వచ్చిన వారిని 14 రోజుల పర్యవేక్షణలో ఉంచుతున్నామని వ్యాఖ్యానించారు. 700 మందికి కరోనా పరిక్షలు చేస్తున్నామని అన్నారు.

మహారాష్ట్రలో కరోనా వైరస్ బాగా విస్తరిస్తుందని 600 కిలోమీటర్ల సరిహద్దు ఉందని ఆ సరిహద్దుని పూర్తిగా ఆపెస్తున్నామని రెండు రోజుల్లో ఈ నిర్ణయం తీసుకుంటామని అన్నారు. అత్యవసరాల కోసం 5 బస్సులు అందుబాటులో ఉంటాయని అన్నారు. ఎవరూ కూడా బయటకు రావొద్దని సూచించారు. రేపు అత్యవసర సర్వీసులు మాత్రమే అందుబాటులో ఉంటాయని అన్నారు. పాలు, వైద్యం అలాంటివి ఉండవని చెప్పారు.

తెలంగాణాలో జనతా కర్ఫ్యూ దేశానికే ఆదర్శంగా నిలవాలని కెసిఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణా ప్రజలను కరోనా వైరస్ ఏమీ చేయలేదనిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఇంట్లో నుంచి బయటకు రాకుండా కాపాడుకోవాలని అన్నారు. కరోనా వైరస్ కి స్వాభిమానం ఎక్కువని, మనం పిలిస్తేనే వస్తుందని అన్నారు. చిరు వ్యాపారులు కూడా కర్ఫ్యూ కి సహకరించాలని ఆయన అన్నారు. జబ్బుని దిగుమతి చేసుకోవడం తెలివి తక్కువ పని అన్నారు. పాలు కూరగాలు అందుబాటులో ఉంటాయని, మనిషికి మూడు మీటర్ల దూరంగా ఉండాలని అన్నారు.

వైద్యుల ఆరోగ్యం మనకు చాలా ముఖ్యమని, వైద్యులు చాలా జాగ్రత్తగా ఉండాలని కెసిఆర్ సూచించారు. వైద్యుల కోసం అన్నీ జాగ్రత్తగా ఉండే విధంగా అవసరమైన పరికరాలు తెచ్చుకుందాం అని, ఎన్ని వేల కోట్లు అయినా సరే ఖర్చు పెట్టడానికి సిద్దంగా ఉన్నామని కెసిఆర్ వ్యాఖ్యానించారు. 60 ఏళ్ళకు పైబడిన వారే కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. సోషల్ మీడియాలో కామెడి చేసే వాళ్ళను కచ్చితంగా అరెస్ట్ చెయ్యాలని కెసిఆర్ సూచించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే బస్సులను సరిహద్దుల్లో నిలిపివేస్తామని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news