ఆరోగ్య‌శాఖ బాధ్య‌త‌ల్లో కీల‌కంగా హ‌రీశ్‌రావు.. అస‌లు కార‌ణ‌మేంది?

-

ఆరోగ్య‌శాఖ‌నుంచి ఈట‌ల రాజేంద‌ర్‌ను తొల‌గించినప్ప‌టి నుంచి ఆ శాఖ‌ను సీఎం కేసీఆర్ త‌న ద‌గ్గ‌రే ఉంచుకున్నారు. అయితే ఈ శాఖ‌కు సంబంధించిన ప‌నులు సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌, హ‌రీశ్‌రావు ముగ్గురూ క‌లిసి చూసుకుంటున్నారు. సీఎం ఆదేశాల మేర‌కే అధికారులు ప‌నిచేస్తున్నారు. ఇక కొవిడ్ టాస్క్‌ఫోర్స్ క‌మిటీ చైర్మ‌న్‌గా కేటీఆర్ రివ్యూలు నిర్వ‌హిస్తున్నారు. డీ ఫ్యాక్టో ఇన్‌చార్జి మంత్రిగా హ‌రీశ్‌రావు ఉన్నారు.

అయితే హ‌రీశ్‌రావు ఎక్కువ‌గా క‌రోనా క‌ట్ట‌డి బాధ్య‌త‌ల్లో పాల్గొంటున్నారు. కేంద్ర మంత్రి హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌తో వీడియో కాన్ఫ‌రెన్స్‌లో పాల్గొంటున్నారు. వ‌రుస‌గా హాస్పిట‌ళ్ల‌ను ప‌రిశీలిస్తున్నారు. ఈ రోజు కూడా గాంధీకి కేసీఆర్‌తో క‌లిసి వెళ్లారు.

కానీ కేటీఆర్ మాత్రం గాంధీకి వెళ్ల‌లేదు. మ‌రి ఆరోగ్య‌శాఖను ముగ్గురూ క‌లిసి చూసుకుంటున్న త‌రుణంలో హ‌రీశ్ రావుకే కీల‌క బాధ్య‌త‌లు ఎందుకు అప్ప‌గించిన‌ట్టో అర్థం కావ‌ట్లేదు. ఆయ‌న‌కే ఆరోగ్య‌శాఖ‌ను కేటాయిస్తారా? అందుకే ముందుగా అన్ని విష‌యాల్లో, మీటింగుల్లో పాల్గొంటున్నారా అనేది కూడా సందేహ‌మే. త్వ‌ర‌లో మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ ఉన్న నేప‌థ్యంలో శాఖ‌ల్లో మార్పులు జ‌రుగుతాయేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version