అమరావతి ఉద్యమానికి వంద రోజులు…!

-

ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిగా అమరావతిని కొనసాగించాలని కోరుతూ ఆ ప్రాంత రైతులు చేస్తున్న నిరసన దీక్ష నేటితో వంద రోజులకు చేరుకుంది. అమరావతి ప్రాంత రైతులు, మహిళలు, రైతు కూలీలు అందరూ కూడా అమరావతి కోసం తమ వంతుగా ముందుకి వస్తున్నారు. భారీగా ఈ ఉద్యమ౦ వంద రోజుల నుంచి కొనసాగుతుంది. రాష్ట్రం నలు మూలల నుంచి ఈ ఉద్యమానికి మద్దతు వచ్చింది.

ఈ వంద రోజులు కూడా అమరావతి ఉద్యమం విషయంలో ప్రభుత్వం ఎక్కడా వెనక్కు తగ్గలేదు అనేది వాస్తవం. అమరావతి ప్రాంత రైతులపై అధికార పార్టీ నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేసారు. అమరావతి ఉద్యమం విషయంలో వైసీపీ ప్రభుత్వం పోలీసుల ద్వారా దురుసుగా వ్యవహరించే ప్రయత్నం చేసింది అనే ఆరోపణలు ఎక్కువగా వినపడుతున్నాయి. ఉద్యమాన్ని తొక్కడానికి చూసారని పలువురు మండిపడ్డారు.

ఇక రాజధానిలో కొన్ని పాలక విభాగాలను ఇతర ప్రాంతాలకు తరలించడం తప్పు అని హైకోర్ట్ కూడా ఆక్షేపించింది. కొన్ని పిటీషన్ లపై విచారణ జరిపిన కోర్ట్ ఈ వ్యాఖ్యలు చేసింది. రాజధాని రైతులకు టీడీపీ సహా వామపక్షాలు అండగా నిలబడ్డాయి. వాళ్ళు అందరూ కూడా అమరావతి ఉద్యమానికి తమ వంతు సహకారం అందించారు. కాని ప్రభుత్వం ఎక్కడా వెనక్కు తగ్గలేదు. ఈ వంద రోజుల్లో కేంద్రం కూడా పెద్దగా స్పందించలేదు.

రాజధానిని ఇక్కడ పూర్తి స్థాయిలో ఉంచేది లేదని రాష్ట్ర ప్రభుత్వం చెప్తూ వస్తుంది. దీనితో రైతులు మహిళలు చాలా మంది అమరావతి ఉద్యమాన్ని తీవ్ర స్థాయిలో చేస్తున్నారు. ఇక శాసన మండలిలో రాజధాని వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందడం ఆ తర్వాత శాసన మండలికి బిల్లు వెళ్లి అక్కడ ఆమోదం పొందడం వంటివి జరిగాయి. మండలిలో బిల్లు వెళ్ళడం a తర్వాత ప్రభుత్వం దాన్ని రద్దు చేయడం జరిగింది.

మహా పాదయాత్రలు చేయడం జాతీయ రహదారి ముట్టడి అసెంబ్లీ ముట్టడి సహా అనేక కార్యక్రమాలు చేసారు. ఈ ఉద్యమం విషయంలో ప్రభుత్వం అనుసరించిన వైఖరి ఇప్పుడు తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఉద్యమం మరింత తీవ్రంగా జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం కరోనా వైరస్ నేపధ్యంలో వెనక్కు తగ్గారు రైతులు. మహిళలు ఈ ఉద్యమం విషయంలో కీలకంగా వ్యవహరించారు. చంద్రబాబు ఈ ఉద్యమంలో ఉండటం ద్వారానే ప్రభుత్వం లైట్ తీసుకుంది అనే వాళ్ళు కూడా ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news