వైసీపీ కార్యాలయం కూల్చివేతపై జగన్ సంచలన ట్వీట్

-

 

తాడేపల్లిలో వైసీపీ కార్యాలయం కూల్చివేతపై మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. కక్ష సాధింపు చర్యలను చంద్రబాబు మరొస్తాయికి తీసుకెళ్లారని అసహనం వ్యక్తపరిచారు.కాగా వైసీపీ కార్యాలయాన్ని ఈరోజు తెల్లవారుజామున సీఆర్‌డీఏ అధికారులు కూల్చివేసిన సంగతి తెలిసిందే.దీనిపై తాజాగా మాజీ సీఎం, వైసీపీ చీఫ్ జగన్ ఎక్స్ వేదికగా స్పందిoచారు.ఒక నియంతలా తాడేపల్లిలో దాదాపు పూర్తికావొచ్చిన వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేయించారని,హైకోర్టు ఆదేశాలనూ బేఖాతరు చేశారని ట్విట్టర్లో మండిపడ్డారు.

ఈరోజు వేకువ జామున పోలీసుల పహారా మధ్య వైసీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు.బోట్ యార్డుగా ఉపయోగిస్తున్న స్థలాన్ని తక్కువ లీజుతో వైసీపీ కార్యాలయం కోసం అప్పటి జగన్ సర్కార్‌ కట్టబెట్టింది. ఈ అక్రమ నిర్మాణంపై వైసీపీకి సీఆర్డీఏ నోటీసులు జారీ చేసింది. తెల్లవారుజామున ఐదు గంటల ప్రాంతంలో ప్రొక్లెయినర్లు, బుల్డోజర్లతో సీఆర్‌డిఏ అధికారులు భవనాన్ని కూల్చేశారు. ఇరిగేషన్ భూమిని ఆక్రమించి, అనధికారికంగా వైసీపీ కడుతున్న పార్టీ కార్యాలయ నిర్మాణాన్ని ఎంటీఎంసీ అధికారులు కూల్చివేశారు. ఫస్ట్‌ ఫ్లోర్‌ శ్లాబ్ వేయడానికి సిద్ధమవుతున్న టైంలో అధికారులు చర్యలు తీసుకున్నారు. నీటిపారుదల శాఖ స్థలంలో భవనం నిర్మించారని అందుకే చర్యలు తీసుకున్నామని అధికారులు చెబుతున్నారు. బోట్ యార్డుగా ఉపయోగించే స్థలాన్ని తాను అధికారంలో ఉన్నప్పడు పార్టీకి తక్కువ లీజుతో కట్టబెట్టారని అది చట్టవిరుద్దమనే ఇప్పుడు చర్యలు తీసుకున్నామని అధికార టీడీపీ చెబుతోంది. దీనిపై ఇప్పటికే నోటీసులు జారీ చేసినట్టు కూడా పేర్కొంటున్నారు.

ఇక ఈ కూల్చివేత పై జగన్ ఏమన్నారంటే….”రాష్ట్రంలో చట్టం, న్యాయం పూర్తిగా కనుమరుగైపోయాయి. ఎన్నికల తర్వాత చోటుచేసుకుంటున్న హింసాత్మక ఘటనలతో రక్తాన్ని పారిస్తున్న చంద్రబాబు, ఈ ఘటన ద్వారా ఈ ఐదేళ్లపాటు పాలన ఏవిధంగా ఉండబోతుందనే హింసాత్మక సందేశాన్ని ఇవ్వకనే ఇచ్చారు. ఈ బెదిరింపులకు, ఈ కక్షసాధింపు చర్యలకు తలొగ్గేది లేదు, వెన్నుచూపేది అంతకన్నా లేదు. ప్రజల తరఫున, ప్రజలకోసం, ప్రజలతోడుగా గట్టిపోరాటాలు చేస్తాం. దేశంలోని ప్రజాస్వామ్య వాదులంతా చంద్రబాబు దుశ్చర్యల్ని ఖండించాలని కోరుతున్నానని’ అన్నారు.అయితే సీఎంగా ఉండగా జగన్ సాగించిన అకృత్యాలపై కొందరు పెదవి విరుస్తున్నారు.గడిచిన ఐదేళ్లలో జరిగిన విధ్వంసం కంటే పెద్ద నష్టం ఎప్పుడు జరగలేదని అంటున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చి రాగానే ప్రజావేదికను కూల్చారు కదా అని వైసీపీని ప్రశ్నిస్తున్నారు.ఆఖరికి కొండలను కూడా పిండి చేసి ప్రకృతి విధ్వంసానికి పాల్పడిన సంఘటనలను ప్రజలు మరచిపోలేదని విమర్శిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version