కవితకు ఎమ్మెల్సీ కాదు…ఎమ్మెల్యే సీటే?

-

తెలంగాణ వచ్చాక నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చాయో లేదో తెలియదు గానీ….కేసీఆర్ కుటుంబానికి మాత్రం రాజకీయ నిరుద్యోగం పోయిందని ప్రతిపక్షాలు ఎప్పుడు విమర్శలు చేస్తూ ఉంటాయి. అయితే ఆ విమర్శలని కేసీఆర్ కూడా నిజమే చేస్తారు..ఎందుకంటే కేసీఆర్ కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఏదొక పదవి ఉంటుంది…కేసీఆర్ సీఎంగా ఉన్నారు…అటు తనయుడు కేటీఆర్ మంత్రి…అలాగే మేనల్లుడు హరీష్ మంత్రిగా ఉన్నారు. అటు మరొక బంధువు సంతోష్ రాజ్యసభ ఎంపీ..అయితే కేసీఆర్ తనయురాలు కవితకు ఏదొక పదవి ఇస్తూనే ఉన్నారు.

2019 ఎన్నికల ముందు వరకు ఆమె ఎంపీ…కానీ 2019 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఓడిపోయాక కొన్నిరోజులు సైలెంట్‌గా ఉన్నారు. ఆ తర్వాత కేసీఆర్…కవితకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఆ ఎమ్మెల్సీ పదవీకాలం త్వరలోనే ముగియనుంది. దీంతో ఆమెకు మళ్ళీ ఎమ్మెల్సీ పదవి ఇస్తారా? ఇవ్వరా? అనే సందేహాలు వస్తున్నాయి.

రాజకీయ నిరుద్యోగం పోగొట్టాలంటే మళ్ళీ ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక ఎమ్మెల్సీ ఇస్తే కంటిన్యూగా ఆరేళ్ళ పాటు ఉండాలి. దీంతో నెక్స్ట్ ఎన్నికల్లో పోటీ చేసి గెలిస్తే, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలి..లేదంటే ఎమ్మెల్సీగా కంటిన్యూ అవ్వాలి. అయితే ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి వచ్చినా రాకపోయినా నెక్స్ట్ ఎన్నికల్లో మాత్రం కవిత మళ్ళీ పోటీ చేయడం ఖాయం. కానీ ఎంపీగా పోటీ చేస్తారా? లేక ఈ సారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా? అనేది క్లారిటీ లేదు.

ఎలాగైనా అరవింద్‌ని ఓడించాలనుకుంటే మరొకసారి ఎంపీగా బరిలో దిగుతారు. అలా కాకుండా ఇక్కడ మంత్రిగా సెటిల్ అవ్వాలనుకుంటే ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని టీఆర్ఎస్ శ్రేణులు మాట్లాడుకుతున్నాయి. ఎక్కువ శాతం ఆమె ఎమ్మెల్యేగానే పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. జగిత్యాల అసెంబ్లీ నుంచి ఆమె పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం నడుస్తోంది. మరి చూడాలి కవితకు ఇప్పుడు ఎమ్మెల్సీ దక్కుతుందో లేక నెక్స్ట్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తారో?

Read more RELATED
Recommended to you

Latest news