ద‌ళిత బంధుపై కేసీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. ఫైర్ అవుతున్న నెటిజ‌న్లు..!

-

మంచి హీట్ మీదున్న తెలంగాణ రాజ‌కీయాల్లో కేసీఆర్ (KCR) వ్యాఖ్య‌లు ఇప్పుడు నిప్పును ర‌గిల్చిన‌ట్టు అయింది. ప్ర‌స్తుతం రాష్ట్ర రాజ‌కీయాల్లో హాట్ టాపిక్ గా ఉన్న హుజూరాబాద్ ఉప ఎన్నిక నేప‌థ్యంలో అనేక మ‌లుపులు చోటుచేసుకుంటున్న విష‌యం తెలిసిందే. కాగా ఇదే క్ర‌మ‌లో కేసీఆర్ ప‌క్కా ప్లాన్ ప్ర‌కారం కాంగ్రెస్ అభ్య‌ర్థిగా ఉన్న‌టువంటి కౌశిక్ రెడ్డిని గులాబీ గూట‌కి ర‌ప్పించారు. అయితే ఈ సంద‌ర్భంగా కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌లు పెద్ద దుమ‌రాం రేపుతున్నాయి.

cm-kcr

 

ఇక ఎన్నో అనుమానాలు లేవ నెత్తుత్తున్న ద‌ళిత బంధుపై స్కీమ్ పై ఓపెన్‌గా కేసీర్ కామెంట్లు చేశారు. అంద‌రూ అనుకున్న‌ట్టు గానే ద‌ళిత బంధు ప‌థ‌కాన్ని హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ల కోస‌మే పెట్టామ‌ని చెప్ప‌డం పెద్ద దుర‌మం రేపుతోంది. రాజ‌కీయ పార్టీ ఏది చేసినా అది అంతిమంగా ఓట్ల కోస‌మే స్కీములు పెడ‌తామంటూ చెప్ప‌డం పెద్ద వివాదాస్ప‌దంగా మాక‌రింది.

సాక్ష్యాత్తు రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఇలా మాట్లాడ‌టంతో సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్లు సంచ‌ల‌న కామెంట్లు చేస్తున్నారు. దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఇక అవ‌కాశం వ‌చ్చిద‌ని ప్ర‌తిప‌క్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. మ‌రీ ఇంత అహంకారం ప‌నికి రాదంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈట‌ల రాజేంద‌ర్ అయితే ఇలాంటి అహంకారాన్ని ప్ర‌జ‌లు ఓడగొట్టాలంటే కోరుతున్నారు. మొత్తానికి కేసీఆర్ చేసిన కామెంట్లు పెద్ద దుమార‌మే రేపుతున్నాయ‌ని చెప్పాల్సిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version