టీడీపీ కి బలమైన నియోజకవర్గంగా ఉన్న విజయవాడలో కొత్త రెక్కలు తెల మీదకు వస్తున్నాయి. ఎంపీ కేశినేని నాని రాజీనామా నిర్ణయం గురించి ఇప్పుడు అంతా చర్చించుకుంటున్నారు అటు చంద్రబాబు తిరువూరు సభకి హాజరయ్యారు. కేశినేని నానికి ఆహ్వానాన్ని పలికారు. తన భవిష్యత్తు నిర్ణయం ఏంటో క్లియర్ గా చెప్పారు కేశినేని నాని విజయవాడ ఎంపీ సీటు నుండి నాని టిడిపిని వదిలిపెట్టడం కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో తనకి సీటు ఇవ్వట్లేదని స్వయంగా నాని చెప్పారు.
తను ఏ పార్టీలో చేరుతాను అనేది అనుచరులతో చర్చించి తర్వాత చెప్తానని స్పష్టం చేశారు ఈ టైంలో వైసిపి నేతలతో నాని సన్నిహితంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. వైసిపి ముఖ్య నేతలు టచ్ లో ఉన్నారని నాని అంటున్నారు. కేశినేని నాని వైసిపి లో చేరే అవకాశం ఉందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నానితో రాజ్యసభ సభ్యులు కనకమెడల రవీంద్ర కుమార్ సమావేశం పైన అభినాభిప్రాయాలు వచ్చాయి. పార్టీ ప్రతినిధిగా కనకమెడల శనివారం నానితో మంతనాలు సాగించినట్లు చెప్తున్నారు తిరువూరు సభలో ఎంపీగా కేశినేని నాని కి ప్రత్యేకంగా సీటు కేటాయించారు కానీ హాజరు అవ్వలేదు నాని సాంకేతికంగానే రాజీనామా జరగలేదని రాజీనామా చేయడం కచ్చితం అని అన్నారు.