అబ‌ద్ధాలు చెప్ప‌డం లో బీజేపీ నాయ‌కుల‌తో కిషన్ రెడ్డి పోటీ ప‌డుతున్నారు. – హరీష్ రావు

కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి అబ‌ద్ధాలు చెప్ప‌డం లో రాష్ట్ర బీజేపీ నాయ‌కుల‌తో పోటీ ప‌డుతున్నార‌ని తెలంగాణ ఆర్థిక మంత్రి హ‌రీష్ రావు అన్నారు. ప‌చ్చి అబద్ధాల‌ను ట్విట్ట‌ర్ వేదిక ప్ర‌చారం చేస్తున్నార‌ని మండి ప‌డ్డాడు. వడ్లు కొనమని చెప్పేది బీజేపీ యే ఇక్కడ వడ్లు వేయాలని చెప్పేది బీజేపీ నే అని అన్నారు. కిష‌న్ రెడ్డి వాస్త‌వాలు తెలుసుకుని మాట్లాడాల‌ని హిత‌పు ప‌లికారు.

ఎయిమ్స్ డైరెక్టర్ కి భవనం తెలంగాణ ప్రభుత్వం మే ఇచ్చింద‌ని గుర్తు చేశారు. దీని పై కూడా అబద్ధాలు ఆడ‌టం స‌రికాద‌ని అన్నారు. అలాగే మెడిక‌ల్ కాలేజీ లు ఇవ్వాల‌ని కేంద్రానికి చాలా సార్లు లేఖ లు రాశామ‌ని అన్నారు. అయితే దేశ వ్యాప్తంగా 157 మెడిక‌ల్ కాలేజీ లు ఇస్తే తెలంగాణ కు ఒక‌టి కూడా ఇవ్వ‌లేద‌ని విమ‌ర్శించారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం తెలంగాణకు ఎయిమ్స్ కాలేజీ ఇవ్వాలి.. కానీ ఇంత వ‌ర‌కు కూడా ఇవ్వ లేద‌ని అన్నారు. రాష్ట్రంలో వ‌డ్దు కొనుగోలు జ‌రుగుత‌న్న బీజేపీ ఎందుకు ధ‌ర్నాలు చేస్తుంది అని ప్ర‌శ్నించారు. బీజేపీ ధ‌ర్న‌కు రైతులు ఎవ‌రూ కూడా రాలేద‌ని అన్నారు.