రేవంత్ రెడ్డి ప్రచారం, పంపించిన డబ్బులు పనిచేయలేదు : కిషన్ రెడ్డి

-

రాజ్యాంగాన్ని చేతబట్టుకుని కాంగ్రెస్ నేతలు విష ప్రచారం చేశారు. కానీ బీజేపీ నేతృత్వంలో మూడో సారి అధికారంలోకి వచ్చాము అని కిషన్ రెడ్డి అన్నారు. పెద్దల సూచన మేరకు శివసేన ను తీసుకొని పోటీ చేసి గెలిస్తే ముఖ్యమంత్రి పీఠం కోసం వెన్నుపోటు పొడిచారు.. కాంగ్రెస్ తో ఉద్ధవ్ ఠాక్రే జత కట్టారు. బీజేపీ పలు రాష్ట్రాల్లో రెండు, మూడు నాలుగో సారి అధికారం లోకి వచ్చాము. కాంగ్రెస్ పార్టీ మూడు రాష్ట్రాలకే పరిమితం అయింది. బై ఎలక్షన్స్ లో కూడా బీజేపీ సత్తా చాటింది. మహారాష్ట్రలో గత ఎన్నికల్లో 44 సీట్లు కాంగ్రెస్ గెలిస్తే ఇప్పుడు అందులో సగం కూడా గెలవలేక పోయింది.

ఇక మేము జార్ఖండ్ లో అనుకున్న పలితాలు సాధించలేకపోయాము. గతంలో బీజేపీకి వచ్చిన ఓట్లను, సీట్లను జార్ఖండ్ లో నిలబెట్టుకోగలిగాం. మహారాష్ట్ర కీలకమైన రాష్ట్రం. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రచారం పని చేయలేదు. ఆయన వసూల్ చేసి పంపించిన డబ్బులు పనిచేయలేదు. ఇక్కడ టీఆర్ఎస్ పోవాలని, 6 గ్యారంటీ ల కోసం కాంగ్రెస్ కు తెలంగాణలో ఓటు వేశారు అని కిషన్ రెడ్డి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news