క్యాడర్ లో జోష్ నింపేలా గులాబీ పార్టీ వ్యూహాలు.. వరుసగా కార్యక్రమాలు చేపట్టాలని ప్లాన్..

-

మహారాష్టలో ఎన్నికల ఫలితాల తర్వాత బిజేపీ తెలంగాణలో యాక్టివ్ అవుతోంది.. మరో పక్క అధికార పార్టీ కూడా దూకుడు మీదుంది.. ఈ నేపథ్యంలో తమ ఆదిపత్యాన్ని ప్రదర్శించేందుకు బీఆర్ఎస్ కూడా వ్యూహాత్మకంగా అడుగులువేస్తోంది.. ఆ రెండు పార్టీలకు ధీటుగా వ్యూహా రచనలు చేస్తోంది.. క్యాడర్ లో జోష్ నింపేలా పార్టీ కార్యక్రమాలు నిర్వహించాలని గులాబీ బాస్ కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారట..

రాజకీయాల్లో వెనుకబడితే కష్టమని భావించిన కేసీఆర్.. దూకుడుగా పార్టీ కార్యక్రమాలు నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు.. మూసీ విస్తరణ, తాజా రాజకీయ పరిణామాలపై కేటీఆర్, హరీష్ రావులు విమర్శలు చేస్తున్నా.. ముఖ్యనేతల నుంచి ఆశంచిన స్థాయిలో ఫర్ఫామెన్స్ కనిపించడంలేదు.. దీంతో క్యాడర్ లో కూడా నిరాశ నెలకొంది.. ఈ క్రమంలో వారిని యాక్టివ్ చేసేందుకు కారు దళపతి పక్కాగా ప్రణాళికలు సిద్దం చేస్తున్నారని పార్టీ వర్గాల నుంచి వస్తున్న టాక్..

పార్లమెంట్ ఎన్నికల తర్వాత సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయిన గులాబీ పార్టీ.. క్యాడర్ ను గాడిన పెట్టేందుకు రెడీ అవుతోంది. ఈ నెల 29న దీక్షా దివస్ తో మళ్లీ డోస్ పెంచాలని ప్రణాళికలు సిద్ధం చేసిందట. ఆ రోజు నుంచే జిల్లా పార్టీ ఆఫీసులలో పార్టీ కార్యక్రమాలు ప్రారంభించేలా గ్రౌండ్ వర్క్ సిద్దం చేస్తుంది.. దీక్షా దివాస్ ను సక్సెస్ చేసేందుకు బీఆర్ఎస్ ముఖ్యనేతలు ఇప్పటికే పలుమార్లు సమావేశాలు నిర్వహించారు.. కేటీఆర్, హరీష్‌ రావు డైరెక్షన్ లో ఈ కార్యక్రమం సక్సెస్ కోసం నేతలు పనిచేస్తున్నారు.. దీని ద్వారా గ్రామస్థాయిలో ఉండే క్యాడర్ లో కూడా ఉత్సాహం నింపేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది..

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది అయింది.. మరో నాలుగేళ్ల పాటు ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన నేపథ్యంలో.. క్యాడర్ యాక్టివ్ గా ఉంటేనే.. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావచ్చిన బీఆర్ఎస్ భావిస్తోందట.. అందుకోసం ప్రతి కార్యక్రమంలో క్యాడర్ ను భాగస్వామిగా చేసుకోవాలని.. జిల్లా అధ్యక్షులకు, ఇన్చార్జులకు ఇప్పటికే ఆదేశాలు వెళ్లాయని టాక్ వినిపిస్తోంది.. ప్రతి జిల్లా కేంద్రాల్లో కార్యాలయాలు ఏర్పాటు చేసుకుని.. కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ.. పార్టీ కార్యక్రమాలు నిర్వహించేందుకు బీఆర్ఎస్ అధిష్టానం అడుగులు వేస్తోంది.. దీక్షా దివాస్ తర్వాత రోజు నుంచి కొత్త బీఆర్ఎస్ ను చూస్తారని సీనియర్ నేతలు చర్చించుకోవడం ఆసక్తికరంగా మారింది..

Read more RELATED
Recommended to you

Exit mobile version