కాషాయమయం: మోదీ మేనియా..కేసీఆర్ సీటు గయా!

-

తెలంగాణలో రోజురోజుకూ బీజేపీ బలపడుతుందని ఎప్పటికప్పుడు కథనాలు వస్తూనే ఉన్నాయి…కానీ తెలంగాణలో బీజేపీ ఓ రేంజ్ లో బలపడిందనే విషయంపై ఎవరికి అవగాహన లేకుండా పోయింది. తాజాగా పరేడ్ గ్రౌండ్ కాషాయమయం అయ్యాక…తెలంగాణలో కేసీఆర్ ని గద్దె దించే శక్తి కమలదళానికి ఉందని అర్ధమైంది. ఈ రోజుల్లో ఏ రాజకీయ సభకైనా రావడానికి జనాలు పూర్తి ఆసక్తి చూపించడం లేదు. ఏదో నేతలు బలవంతంగా తరలించడం, లేదా డబ్బులు ఇచ్చి సభలకు జనాలని రప్పించుకోవడం చేస్తున్నారు.

కానీ స్వచ్ఛందంగా వచ్చిన జనం స్పందన ఎలా ఉంటుందో…పరేడ్ గ్రౌండ్ లో జనం మోదీ మోదీ అని అరుస్తుంటే అర్ధమైంది. జనం అరుపులకు..మోదీ సైతం రెండు, మూడు సార్లు తన స్పీచ్ కు బ్రేక్ ఇవ్వాల్సి వచ్చిందంటే…పరిస్తితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అలాగే మోదీ సైతం వచ్చిన జనాలని చూసి ఆశ్చర్యపోయి…బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ భుజం తడుతూ మెచ్చుకున్నారంటే  తెలంగాణలో కమల వికాసానికి సమయం ఆసన్నమైనట్లు కనిపిస్తోంది.

మామూలుగా మోదీ హైదరాబాద్ కు వచ్చారు…జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొన్నారు..తెలంగాణలో బలపడటంపై నేతలకు దిశానిర్దేశం చేశారు…ఆ తర్వాత పరేడ్ గ్రౌండ్ లో విజయ్ సంకల్ప్ సభలో పాల్గొని వెళ్లిపోతారు…ఇదే అని అంతా అనుకున్నారు. కానీ విజయ్ సంకల్ప్ సభ చూశాక..ఇది తెలంగాణలో బీజేపీ విజయానికి నాంది అనేది అందరికీ అర్ధమైంది.

ముఖ్యంగా బీజేపీపై వార్ ప్రకటించిన టీఆర్ఎస్ పార్టీని టెన్షన్ పెట్టించే సభ…ఇప్పటికీ మోదీ మేనియా తగ్గలేదని సభ ద్వారా అర్ధమైంది…ఇక ఇదే క్రమంలో కేసీఆర్ సీఎం సీటు గయా! అనే మాదిరిగా కమలదళం గర్జించింది. ఇదే ఊపుని ఎన్నికల వరకు కొనసాగిస్తే…తెలంగాణలో కేసీఆర్ ని గద్దె దించి…కాషాయ జెండా ఎగిరే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి విజయ్ సంకల్ప్ సభ ద్వారా…తెలంగాణలో విజయం దిశగా పయనిస్తున్నట్లు..కమలం నిరూపించింది…కాబట్టి బీ అలెర్ట్ కేసీఆర్..బీజేపీని తక్కువ అంచనా వేస్తే రిస్క్ తప్పదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version