తెలంగాణలో కాంగ్రెస్ స్ట్రాంగ్ అవుతుందా? ఇంకా వీక్‌గానే ఉందా? అంటే వీక్ గానే ఉన్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే గత రెండు పర్యాయలుగా ఓడిపోతూ కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరమైంది. కానీ ఈ సారి ఎలాగైనా అధికారంలోకి రావాలని చెప్పి టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. నిజానికి రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అయ్యాక కాంగ్రెస్ పార్టీకి కాస్త ఊపు వచ్చింది.. కానీ కాంగ్రెస్‌లో జరుగుతున్న కొన్ని పరిణామాల వల్ల పార్టీ పరిస్తితి దిగజారుతూ వస్తుంది.
ఓ వైపు బీజేపీ దూసుకెళుతున్న విషయం తెలిసిందే. టీఆర్ఎస్‌కు ధీటుగా బీజేపీ ఎదుగుతుంది. ఇంకా ఆ రెండు పార్టీల మధ్య వార్ తీవ్ర స్థాయిలో నడుస్తోంది. దీంతో కాంగ్రెస్ పార్టీ ఇంకా వీక్ అవుతూ వస్తుంది. పైగా పార్టీలో అంతర్గత కలహాల వల్ల ఇంకా ఇబ్బంది పడే పరిస్తితి. ఇప్పటికే పార్టీలో అంతర్గత కలహాలు తారస్థాయికి చేరుకున్నాయి. దీని వల్ల కాంగ్రెస్ పార్టీకి బాగా డ్యామేజ్ జరుగుతుంది.
ఇలా అనూహ్యంగా రేసులో వెనుకబడిన కాంగ్రెస్‌లో ఇప్పుడు కొత్త ట్విస్ట్ వచ్చి పడింది. ఇటీవల కాంగ్రెస్ అధిష్టానం సరికొత్త రూల్‌ని తెరపైకి తీసుకురావడానికి చూస్తున్నట్లు తెలిసింది. అదేంటి ఏంటంటే…ఇకపై పిసిసి అధ్యక్షులు గానీ, డిసిసి అధ్యక్షులు గానీ ఎన్నికల్లో పోటీ చేయడానికి వీల్లేదనే విధంగా రూల్ తీసుకొస్తున్నారని తెలుస్తోంది. అంటే పిసిసి, డిసిసి అధ్యక్షులు కేవలం పార్టీని బలోపేతం చేయడానికి, తమ బాధ్యతలని సక్రమంగా నిర్వర్తిస్తూ…పార్టీని గెలిపించడం కోసం, వారు పోటీ చేయడానికి వీల్లేదని రూల్ తెచ్చేలా ఉన్నారు.
దీని వల్ల పిసిసి అధ్యక్షుడుగా ఉన్న రేవంత్ రెడ్డికి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. కానీ రేవంత్ రెడ్డి పోటీ చేయకుండా ఉండటం అనేది అసాధ్యం కాబట్టి ఆయన్ని మినహాయిస్తే మిగిలిన జిల్లా అధ్యక్షుల పరిస్తితి ఏంటి అనేది క్లారిటీ లేదు. రూల్ సంగతి తర్వాత ముందు అధ్యక్ష పదవులు వదులుకునేందుకు వారు సిద్ధమవుతున్నారట. ఇలా కాంగ్రెస్‌లో ఊహించని ట్విస్ట్‌లు చోటు చేసుకుంటున్నాయి.