భారత ఉద్యోగులను చిత్రహింసలు పెట్టిన పాక్..!

-

భారత్ పాక్ ల వైరం ఈనాటిది కాదు.. ఇరు దేశాల మధ్య నిత్యం ఏదో ఒక ఉద్రిక్తత నెలకొంటూనే ఉంటుంది. ఇక ఇదే  నేపద్యంలో భారత దేశ హైకమిషన్ ఉద్యోగులను పాక్ భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి, వారిని దాదాపుగా 12 గంటలపాటు అదుపులో ఉంచుకుని చివరికి భారత్ పెంచిన ఒత్తిడి తట్టుకోలేక విముక్తి చేశాయి. వారిని అదుపులోకి తిసుకోడమే కాకుండా చిత్రహింసాలకు గురి చేసినట్టు తెలుస్తుంది.

వివరాల్లోకి వెళితే.. పాకిస్థాన్ లోని ఇస్లామాబాద్ లో విదులు నిర్వహిస్తున్న భారత్ సంతతి ఉద్యోగులను పాకిస్థాన్ భద్రాత బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. వారివల్ల అక్కడ రోడ్డు ప్రమాదం నెలకొంది అనే కట్టు కథ అల్లి అందుకుగాను వారిని అరెస్ట్ చేశాయి. వారి కళ్ళకు గంతెలు కట్టి ఓ రహస్య స్థావరానికి తీసుకెళ్లారు. అక్కడ వారిని అనేక చిత్రహింసలకు గురి చేసినట్టు తెలుస్తుంది.. వారిని రాడ్లతో కర్రలతో చితకబాది మురికి నీరు తాగించారని సమాచారం. వారిని అదుపులోకి తీసుకున్నారని తెలిసిన వెంటనే భారత్ తగిన చర్యలు చేపట్టి అనేక మార్గాల్లో పాక్ పై ఒత్తిడి పెంచింది. భారత్ ఒత్తిడి తాళలేక పాక్ వారిని రాత్రి 9 గంటల ప్రాంతంలో భారత హైకమిషన్ కు అప్పగించింది. ఇక వారు చేసిన ఈ దుశ్చర్యను సమర్దిస్తూ పాక్ మీడియా కట్టుకథలను అల్లి వార్తల్లో  ప్రచురిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news