ఆంధ్రప్రదేశ్ రాజకీయ నేతలలో విమర్శలు చేస్తూ ఊగిపోవటం లో పవన్ కళ్యాణ్ ని మించిన వారు మరొకరు లేరని చెప్పవచ్చు. ముఖ్యంగా వైఎస్ జగన్ ని విమర్శించడంలో ఎప్పుడూ ముందుండే పవన్ కళ్యాణ్…ఇంగ్లీష్ మీడియం విద్యా విధానాన్ని అదేవిధంగా ఇసుక సమస్యలతో ప్రభుత్వంపై వ్యతిరేకత తీసుకురావడానికి తీవ్రంగా కృషి చేయడం జరిగింది. అయితే ఆ రెండు కార్యక్రమాల వల్ల ఎక్కడా కూడా రాష్ట్రంలో ప్రజలు జగన్ ప్రభుత్వాన్ని విమర్శించిన దాఖలాలు లేవు.
అటువంటి సమయంలో ఏపీ సీఎం జగన్ అభివృద్ధి ఒకచోట కాదు అంతటా జరగాలని మూడు రాజధానులు అనే కాన్సెప్ట్ తెరపైకి తీసుకు రావడంతో అమరావతి రైతులు ఒక్కసారిగా రోడ్ ఎక్కడం జరిగింది. దీంతో ఇదే మంచి అవకాశం అని భావించిన పవన్ కళ్యాణ్..అమరావతి రైతులు చేస్తున్న దీక్షలకు నిరసనలకు సంఘీభావం తెలపడం జరిగింది. ఆ తర్వాత బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్న పవన్..కేంద్రంలో బీజేపీ ఉండటంతో కచ్చితంగా బిజెపి పార్టీ తో అమరావతి రైతులకు అండగా నిలబడి జగన్ ప్రభుత్వం పై వ్యతిరేకత తీసుకురావాలని కవాతు ప్రోగ్రాం ప్లాన్ చేశారు.
దీంతో అమరావతి రైతులు పవన్ చేయబోయే కవాతు కార్యక్రమం పై గంపెడాశలు పెట్టుకోవడం జరిగింది. కానీ బిజెపి పార్టీ నుండి పవన్ కళ్యాణ్ కి సరైన సపోర్ట్ లేకపోవడంతో పవన్ కళ్యాణ్ గిల గిల గిల కొట్టుకుంటున్న పరిస్థితిలో పొలిటికల్ కెరియర్ పడిపోయిందని…అందుకే సినిమాలు చేసుకుంటూ అడపాదడపా రాజకీయాలు అన్నట్టుగా పవన్ వ్యవహరిస్తున్నారని రాజకీయవిశ్లేషకులు కామెంట్ చేస్తున్నారు.