కాశ్మీర్ విభజన బిల్లుకు ఆమోదం తెలిపిన రాజ్యసభ..!

-

కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఆర్టికల్ 370, 35ఎ లను రద్దు చేస్తూ ఇవాళ రాజ్యసభలో తీర్మానం చేశారు. అయితే సుదీర్ఘంగా సాగిన చర్చ అనంతరం రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు చివరకు ఓటింగ్ చేపట్టారు. దీంతో కాశ్మీర్ విభజన బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది.

గత కొద్ది రోజులుగా కాశ్మీర్‌లో చోటు చేసుకుంటున్న అనూహ్య పరిణామాలకు నేటితో తెర పడింది. ఎట్టకేలకు కాశ్మీర్ గందరగోళ స్థితిపై కేంద్రం ప్రకటన చేసింది. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఆర్టికల్ 370, 35ఎ లను రద్దు చేస్తూ ఇవాళ రాజ్యసభలో తీర్మానం చేశారు. అయితే సుదీర్ఘంగా సాగిన చర్చ అనంతరం రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు చివరకు ఓటింగ్ చేపట్టారు. దీంతో కాశ్మీర్ విభజన బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది.

rajyasabha passed kashmir division bill

కాశ్మీర్ రాష్ర్టానికి గాను ఆర్టికల్ 370, 35ఎ లను రద్దు చేస్తూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతోపాటు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కూడా దీన్ని సమర్థిస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఇక జమ్మూకాశ్మీర్‌ను విభజిస్తూ సభలో బిల్లును కూడా ప్రవేశపెట్టారు. కాగా బిల్లుపై రాజ్యసభలో సుదీర్ఘంగా చర్చ సాగింది. ఓ దశలో సభ్యులు తీవ్ర వాదోపవాదాలు చేసుకున్నారు. అయితే ఎట్టకేలకు సభలో ఓటింగ్ చేపట్టగా.. కొందరు సభ్యులు డివిజన్ కోరారు. దీంతో ఓటింగ్ మరింత ఆలస్యమైంది.

కాగా రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు కాశ్మీర్ విభజన బిల్లుపై చేపట్టిన ఓటింగ్‌కు అనుకూలంగా 125 మంది సభ్యులు ఓటేశారు. అలాగే 61 మంది బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేశారు. దీంతో మెజారిటీ ఉన్నందు వల్ల కాశ్మీర్ విభజన బిల్లుకు ఆమోదం లభించింది. కాగా ఈ ఓటింగ్‌లో ఒక సభ్యుడు పాల్గొనలేదు. ఇక ఓటింగ్‌ను ముందుగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ సహాయంతో చేపట్టాలని అనుకున్నా.. సాంకేతిక సమస్య రావడంతో చివరకు స్లిప్పులతోనే ఓటింగ్ నిర్వహించారు. కాగా అటు లోక్‌సభలోనూ ఇదే బిల్లును కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఇప్పటికే ప్రవేశపెట్టగా.. రేపు సభలో ఈ బిల్లుపై చర్చ జరగనుంది. అనంతరం లోక్‌సభలోనూ ఓటింగ్ నిర్వహించి బిల్లును ఆమోదింపజేస్తారు..!

Read more RELATED
Recommended to you

Latest news