పవన్ కల్యాణ్‌తోనా.. మాకా ఉద్దేశం లేదు.. షాకిచ్చిన రామ్ మాధవ్

-

మోదీ పాలన చూసి ఏపీలో చాలామంది బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కాకపోతే.. ఏపీలో తమ పార్టీ ఒంటరిగానే ఎదిగేందుకు ప్రయత్నిస్తుంది. నేను తానా సభల్లో పాల్గొనేందుకు ఇక్కడికి వచ్చా. ఈ పర్యటనకు ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదు.. అంటూ రామ్ మాధవ్ స్టేట్‌మెంట్ కూడా ఇచ్చారు.

తెలుగు రాష్ర్టాల్లో ఎలాగైనా పాగా వేయాలన్న కసితో ఉంది బీజేపీ. దానిలో భాగంగానే ఆపరేషన్ ఆకర్ష్‌ను ప్రారంభించింది. పలు ముఖ్య నేతలను తమ పార్టీలోకి లాక్కునే ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ ఎంపీలు.. బీజేపీలో చేరారు. కొందరు ఇతర నేతలు కూడా బీజేపీలో చేరారు. అయితే.. పవన్ కల్యాణ్‌ను కూడా తమవైపునకు తిప్పుకోవాలని బీజేపీ యోచిస్తోందన్న వార్తలు వచ్చిన నేపథ్యంలో వాటికి చెక్ పెట్టారు బీజేపీ జాతీయ నేత రామ్ మాధవ్.

ఆయన తానా సభల్లో పాల్గొనేందుకు యూఎస్ వెళ్లారు. పవన్ కూడా తానా సభల్లో పాల్గొనేందుకు యూఎస్ వెళ్లారు. అక్కడ రామ్ మాధవ్, పవన్ కల్యాణ్ ఇద్దరూ భేటీ అయ్యారు. దీంతో జనసేన బీజేపీలో కలిసిపోతోందన్న వార్తలు గుప్పుమన్నాయి. కానీ.. కేవలం ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయన్న అంశంపై మాత్రమే తాను పవన్‌తో చర్చించానని.. అంతకుమించి మా ఇద్దరి మధ్య ఏం జరగలేదన్నారు. అది కేవలం మర్యాద పూర్వక భేటీ అని తుస్సున గాలి తీశారు రామ్ మాధవ్. పవన్ కల్యాణ్‌తో కలిసి పని చేసే ఉద్దేశం తమకు లేదని ఆయన కుండ బద్దలు కొట్టారు. దీంతో ఇదంతా ఉత్త గాసిప్పేనా అని అంతా అనుకున్నారు.

మోదీ పాలన చూసి ఏపీలో చాలామంది బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కాకపోతే.. ఏపీలో తమ పార్టీ ఒంటరిగానే ఎదిగేందుకు ప్రయత్నిస్తుంది. నేను తానా సభల్లో పాల్గొనేందుకు ఇక్కడికి వచ్చా. ఈ పర్యటనకు ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదు.. అంటూ రామ్ మాధవ్ స్టేట్‌మెంట్ కూడా ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news