పవన్ కల్యాణ్ చేతిపై జగన్ టాటూ.. అస‌లు క‌థేంటంటే..?

-

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇలా ప్ర‌స్తుతం పవర్ స్టార్ మంచి జోరు మీద ఉన్నాడు. ఓ వైపు సినిమాలతో, మరోవైపు రాజకీయాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఏళ్ల తరబడి గ్యాప్ వచ్చినా, సినిమా ప్లాప్ అయినా పవన్ క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. అయితే పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు సినిమా రంగం నుంచి రాజకీయ రంగంలోకి అడుగుపెట్టారు. అయితే, ఆ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ ఎన్నికల్లో జనసేన పార్టీ ఓడిపోవడంతో.. పవన్ తిరిగి ఇప్పుడు సినిమాలపై దృష్టి పెట్టారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌స్తుతం పవన్ వరసగా మూడు సినిమాలు చేస్తున్నారు. అయితే తాజాగా పవన్ ఫ్యాన్స్‌కి చిర్రెత్తుకొచ్చే పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పవన్ చేతిమీద ఏపీ సీఎం అనే టాటూ ఉన్నట్టుగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.

పవన్ చేతిపై ఆంధ్రా సీఎం పచ్చ బొట్టు మార్ఫింగ్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో.. దీనిపై మీమ్స్‌ కూడా ఓ రేంజ్‌లో వస్తున్నాయి. దీంతో జనసైనికులు మండిపడుతున్నారు. వాస్త‌వానికి ఇటీవల కర్నూలు, ఎమ్మిగనూరు నియోజకవర్గ క్రియాశీలక కార్యకర్తల సమావేశంలో పవన్ కల్యాణ్ మాట్లాడారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ కు సంబంధించిన ఓ ఫొటోను కొందరు మార్ఫింగ్ చేశారు. ఎలాంటి టాటూ లేని పవన్ చేతిపై జగన్ ఫొటోను ఉంచారు. దీన్ని సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో పాటు, జనసేన ట్విట్టర్ అకౌంట్ కు కూడా ట్యాగ్ చేసారు. దీంతో ఈ మార్ఫింగ్ ఫోటోపై జనసేన అభిమానులు తీవ్ర స్టాయిలో ఆగ్రం వ్య‌క్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news