‘కారు’కు షర్మిల డీజిల్…?

-

తెలంగాణలో కొత్తగా పార్టీ పెట్టిన షర్మిల…కేసీఆర్ ప్రభుత్వంపై ఓ రేంజ్ లో విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. వైఎస్సార్టీపీ పేరిట ఏడాది క్రితం పార్టీ పెట్టిన షర్మిల…వరుసపెట్టి తెలంగాణలోని సమస్యలపై పోరాటం చేస్తూ…నిత్యం కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు..అలాగే నిరసనలు, పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళుతున్నారు. ఆమె పూర్తిగా కేసీఆర్ ప్రభుత్వంపై ఫోకస్ పెట్టి ముందుకెళుతున్నారు.

అయితే ఇలా కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న షర్మిల..టీఆర్ఎస్ పార్టీకి ఏమన్నా చెక్ పెట్టగలరా? అంటే ప్రస్తుతానికి ఆమెకు అంత బలం లేదని చెప్పొచ్చు. సరే అంత బలం లేకపోయినా ఎంతోకొంత షర్మిల పార్టీ వల్ల…టీఆర్ఎస్ పార్టీకి నష్టం జరుగుతుందా? అంటే అబ్బే అదేం లేదని తెలుస్తోంది..షర్మిల పార్టీ వల్ల టీఆర్ఎస్ కు నష్టం కంటే లాభం జరిగేలా ఉందని తాజా సర్వేల్లో తెలుస్తోంది. అలాగే టీఆర్ఎస్ పై పోరాడుతున్న కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగేలా ఉంది.

తాజాగా వెలువడిన ఆరా సర్వేలో షర్మిల పార్టీ ప్రభావం పెద్దగా ఉండదని తేలింది…అలాగే ఒక శాతం ఓట్లు మాత్రమే ఆ పార్టీకి వచ్చేలా ఉన్నాయని తెలిసింది. అయితే షర్మిల పార్టీ ప్రభావం…ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో ఎక్కువ ఉంటుందని తేలింది. ఆ జిల్లాల్లో ఉన్న రెడ్డి, దళిత వర్గాల్లో ప్రభావం చూపుతుందని తెలిసింది.

ప్రధానంగా రెడ్లు, దళితులు కాంగ్రెస్ పక్షాన ఉంటారు…ఇప్పుడు షర్మిల పార్టీ వచ్చి వారి ఓట్లని చీల్చి కాంగ్రెస్ కు డ్యామేజ్ చేసి..కారు పార్టీకి మేలు చేయనుంది. అలాగే బీఎస్పీ వల్ల కూడా టీఆర్ఎస్ కు మేలు, కాంగ్రెస్ కు నష్టం జరుగుతుందని తెలుస్తోంది. బీఎస్పీ సైతం…దళిత, గిరిజన వర్గాల్లో ఎక్కువ ప్రభావం చూపనుంది. దళిత, గిరిజనులు కాంగ్రెస్ వైపు ఎక్కువ ఉంటారు..ఇప్పుడు బీఎస్పీ వల్ల కాంగ్రెస్ కే నష్టం…అలాగే టీఆర్ఎస్ కు లాభం. మొత్తానికైతే షర్మిల పార్టీ వల్ల కాంగ్రెస్ పార్టీకి నష్టం, టీఆర్ఎస్ పార్టీకి లాభం జరిగేలా ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version