షర్మిల రాజకీయం..ఒక్క సీటుపైనే ఆశలు.!

-

తెలంగాణలో కొత్తగా పార్టీ అక్కడ రాజకీయాల్లో షర్మిల దూకుడుగా ఉంటున్న విషయం తెలిసిందే. వైఎస్సార్ తెలంగాణ అని పార్టీ పెట్టి..అధికార బి‌ఆర్‌ఎస్ పై గట్టిగానే పోరాటం చేస్తున్నారు. పాదయాత్ర చేశారు. నిత్యం కే‌సి‌ఆర్ ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేస్తూనే వస్తున్నారు. అదే సమయంలో ఆమె ఒకోసారి బి‌జేపికి మద్ధతు ఇస్తున్నారని , కాదు కాదు ఇటీవల ఆమె డి‌కే శివకుమార్ తో భేటీ అయ్యారు కాబట్టి కాంగ్రెస్ తో కలుస్తున్నారని ప్రచారం జరుగుతుంది.

తాజాగా అయితే కాంగ్రెస్ లో షర్మిల పార్టీ విలీనం చేసేస్తున్నారని ప్రచారం మొదలైంది. ఈ క్రమంలోనే షర్మిల ఆ అంశంపై క్లారిటీ ఇచ్చారు. బీజేపీ తో కేసీఆర్ డ్యూయెట్లు పాడుకుంటున్నారని, కేసీఆర్ కు సప్లై కంపెనీగా కాంగ్రెస్ మారిందని, విలీనం చేయడానికి ఇంత కష్టం పడాల్సిన అవసరం తనకెందుకు అని, విలీనం అని ఓ మహిళ కష్టాన్ని అవమానించకండని అంటున్నారు. నాడు తాను వస్తా అంటే వద్దు అనే పార్టీ ఏదైనా ఉందా? అని ప్రశ్నించిన ఆమె.. చివరికి కేసీఆర్ కూడా కాదనే వాడా? అభ్యర్థులను తయారు చేసుకుని పోటీ చేస్తామని ప్రకటించారు.

అయితే విలీనం లేదని ఆమె చెప్పేశారు. పొత్తులపై మాత్రం సరిగ్గా క్లారిటీ లేదు. సరే ఇప్పుడున్న పరిస్తితుల్లో వైఎస్సార్టీపీ..ఒక్క సీటు కూడా గెలుచుకునే అవకాశాలు కనిపించడం లేదు.

కొద్దో గొప్పో షర్మిల పోటీ చేసే సీటుపైనే ఆశలు పెట్టుకోవచ్చు అని చెప్పవచ్చు. ఆమె పాలేరులో పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు. అయితే అక్కడ గెలిచేస్తారని నమ్మకం లేదు. అక్కడ బి‌ఆర్‌ఎస్, కాంగ్రెస్ బలంగా ఉన్నాయి. ఆ రెండు పార్టీలని దాటుకుని షర్మిల గెలుపు ఈజీ కాదు. ఇక షర్మిల తప్ప ఆ పార్టీలో బలమైన అభ్యర్ధులు లేరు. కాబట్టి ఆమె ఎక్కువశాతం పొత్తుకే మొగ్గు చూపే ఛాన్స్ ఉంది. కాంగ్రెస్ తో పొత్తు ఉంటే పాలేరులో షర్మిలకు గెలుపు అవకాశాలు ఉంటాయి. చూడాలి మరి షర్మిల ఏ నిర్ణయం తీసుకుంటారో.

Read more RELATED
Recommended to you

Exit mobile version