ట్రంప్ భ‌ర్య మెలానియాలో అప్పటికీ ఇప్పటికీ ఎంత మార్పు.. ఈ వీడియో చూస్తే మీకే అర్థం అవుతుంది..!

-

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సతీమణి మెలానియాతో పాటు నిన్న‌ భారత్ చేరుకున్న విషయం విదితమే. అయితే మెలానియా ట్రంప్ గురించే చూస్తే.. ఒకప్పుడు ఓ సాధారణ మహిళ. ఇప్పుడు అమెరికా ప్రథమ మహిళ. శ్వేత సౌధానికి మహారాణి. ఎన్నో అష్టకష్టాలు పడి ఆమె ఉన్నతస్థాయికి చేరుకుంది. ట్రంప్‌ టెంపరితనాన్ని భరిస్తూ అంచెలంచెలుగా ఎదిగింది. మెలానియా ట్రంప్‌ ఒకప్పుడు ఫ్యాషన్‌ డిజైనర్. ఆ తర్వాత సూపర్‌ మోడల్‌. మోడలింగ్‌ చేస్తూ అతి పెద్ద ప్రపంచాన్ని చూశారు. 6 భాషల్లో ఆమె అనర్గళంగా మాట్లాడగలరు. మెలానియా మునుపెన్నడూ లేనంత సంతోషంగా కనిపిస్తుండడం అంతర్జాతీయ మీడియాను ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. అందుకు కారణం ఉంది. ట్రంప్ అనేక దేశాల్లో పర్యటించినప్పుడు ఆయన మెలానియాను కూడా తీసుకువెళ్లేవారు.

కానీ మెలానియా సాధ్యమైనంతవరకు ట్రంప్ తో అంటీముట్టనట్టుగానే వ్యవహరించేవారని కథనాలు వచ్చాయి. అందుకు ఆధారంగా వీడియో ఫుటేజ్ కూడా ఉంది. వీరిద్దరి మధ్య సఖ్యత లేదని, వైట్ హౌస్ లోనూ వీరు ఎడమొహం పెడమొహంగా ఉంటారని ప్రచారం జరిగింది. మ‌రియు విదేశీ పర్యటనల్లో మెలానియా ముఖంపై పెద్దగా చిరునవ్వు కనిపించేది కాదు. అయితే రత్ పర్యటనకు వచ్చింది మొదలు మెలానియాలో తుళ్లిపడే సంతోషంతో కనిపిస్తోంది. ట్రంప్ తోనూ సన్నిహితంగా మసలుకుంటున్నాపరు. సబర్మతి ఆశ్రమ సందర్శన మొదలు, నమస్తే ట్రంప్, తాజ్ మహల్ సందర్శనలో ఆ విషయం స్పష్టంగా కనిపించింది. ముఖ్యంగా ప్రేమకు చిహ్నంలా బాసిల్లే తాజ్ మహల్ వద్ద ట్రంప్, మెలానియాల బాడీ లాంగ్వేజి గమనిస్తే వారిలో ప్రేమభావనలు పురివిప్పిన అనుభూతి కలుగుతుంది. చేతిలో చేయి వేసుకుని నడిచిన తీరులో ఎక్కడా నాటకీయత కనిపించలేదు.

Read more RELATED
Recommended to you

Latest news