కాంగ్రెస్ లో చేరిన సోనూసూద్ సోద‌రి

-

క‌రోనా క‌ష్ట కాలంలో ఎంతో మందికి సాయం చేసి హెల్పింగ్ స్టార్ గా పేరు తెచ్చుకున్న సోనూసుద్ సోద‌రి మాళ‌విక కాంగ్రెస్ పార్టీలో చేరింది. పంజాబ్ పీసీసీ చీఫ్ న‌వజ్యోత్ సింగ్ సిద్ధు ఆధ్వ‌ర్యంలో మాళ‌విక సూద్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పంజాబ్ లోని మోగా జిల్లాలో ఉన్న సోనూసూద్ నివాసం మాళ‌విక సూద్ కాంగ్రెస్ పార్టీలో చేరింది. పీసీసీ చీఫ్ సిద్దుతో పాటు పంజాబ్ ముఖ్య మంత్రి చన్నీ కూడా ఈ కార్యక్ర‌మంలో ఉన్నారు.

కాగ రాబోయే పంజాబ్ సాధార‌ణ ఎన్నిక‌ల్లో మాళ‌విక సూద్ పోటీ చేసే అవ‌కాశం ఉన్న‌ట్టు తెలుస్తుంది. అయితే సోనూసూద్ సోద‌రి మాళ‌విక సూద్ కాంగ్రెస్ పార్టీలో చేరే సమ‌యంలో సోనూ అక్క‌డే ఉన్నారు. అయితే గ‌తంలో హెల్పింగ్ స్టార్ సోనూసూద్ రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నార‌నే వార్తలు ఎక్కువ గా వ‌చ్చాయి. అప్పుడు సోనూసూద్ ఆ వార్త‌లను ఖండించారు. అలాగే ఈ వార్త‌ల‌పై అప్ప‌ట్లో స్పందిస్తు.. తాను రాజ‌కీయాల్లోకి రాను అని తెలిపారు. కానీ త‌న సోద‌రి మాళ‌విక సూద్ రాజ‌కీయాల్లోకి వ‌చ్చి ప్ర‌జా సేవ చేస్తుంద‌ని ప్ర‌క‌టించారు.

Read more RELATED
Recommended to you

Latest news