టీడీపీ-జనసేన మధ్య సీట్ల పంచాయితీ..దెబ్బపడేలా.!

-

టీడీపీ-జనసేన: టీడీపీ-జనసేన పొత్తు ఇంకా తేలలేదు..కానీ అప్పుడే ఆ రెండు పార్టీల మధ్య సీట్ల పంచాయితీ మొదలైపోయింది. పలు చోట్ల సీటు మాదే అంటే మాది అని రెండు పార్టీల నేతలు పోటీ పడుతున్నారు. అయితే పొత్తు దిశగా చంద్రబాబు, పవన్ వెళుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలుమార్లు వారు భేటీ అయ్యారు. ఇక పొత్తు ఖాయమని చెప్పేశారు. కాకపోతే వారితో బి‌జే‌పి కలుస్తుందా లేదా అనేది క్లారిటీ లేదు.

ఇక అధికారికంగా పొత్తు ఖాయం అవ్వాలి. అదే సమయంలో సీట్ల లెక్క తేలాలి. సీట్లని చంద్రబాబు, పవన్ మాత్రమే తేల్చుకుంటారు. కింది స్థాయి నేతల ఎలాంటి మాట చెప్పిన అది వర్కౌట్ కాదు. కానీ పొత్తు ఇంకా పూర్తిగా ఫిక్స్ కాకముందే సీట్లపై రచ్చ నడుస్తుంది. కొన్ని సీట్ల విషయం లో రెండు పార్టీలు పట్టుబడుతున్నాయి. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో సీట్ల కోసం డిమాండ్ ఎక్కువగా ఉంది. సీటు మాదే అంటే మాది అని నేతలు పోటీ పడుతున్నారు.

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పలు సీట్లలో రెండు పార్టీల మధ్య పోటీ ఉంది. అమలాపురం, ముమ్మిడివరం, రాజమండ్రి రూరల్, కాకినాడ సిటీ, రూరల్, పిఠాపురం, ప్రత్తిపాడు, కొత్తపేట ఇలా కొన్ని సీట్ల విషయంలో రచ్చ జరుగుతుంది. అటు ఉమ్మడి విశాఖలో భీమిలి, గాజువాక, విశాఖ నార్త్, ఎలమంచిలి, అనకాపల్లి సీట్ల విషయంలో పంచాయితీ ఉంది. ఇటు ఉమ్మడి పశ్చిమ గోదావరిలో ఏలూరు, తణుకు, నరసాపురం, తాడేపల్లిగూడెం, నిడదవోలు లాంటి సీట్లలో పోటీ ఉంది.

ఉమ్మడి కృష్ణాలో మచిలీపట్నం, పెడన, అవనిగడ్డ, విజయవాడ వెస్ట్, కైకలూరు సీట్లలో రెండు పార్టీలు పోటీ పడుతున్నాయి. అలాగే ఉమ్మడి గుంటూరులో ప్రత్తిపాడు, తెనాలి, గుంటూరు వెస్ట్, గుంటూరు ఈస్ట్ సీట్లలో పోటీ ఉంది. ఈ పంచాయితీ ఇలాగే కొనసాగితే రెండు పార్టీలకు నష్టం..అలా కాకుండా ఎవరికి వారు సర్దుకుంటే ఇబ్బందులు ఉండవు.

Read more RELATED
Recommended to you

Exit mobile version