జూనియర్‌ వివాదానికి బ్రేక్..టీడీపీ నుంచి క్లారిటీ.!

-

తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్న విషయం తెలిసిందే. పార్టీలతో సంబంధం లేకుండా ఉత్సవాలు జరుగుతున్నాయి. గత ఏడాది నుంచి టి‌డి‌పి సైతం శత జయంతి ఉత్సవాలని ఘనంగా నిర్వహిస్తుంది. ఇటీవల పలువురు సినీ ప్రముఖులతో కలిపి హైదరాబాద్‌లో వేడుకలు నిర్వహించారు. దీనికి చంద్రబాబు, బాలకృష్ణ, వెంకటేష్, రామ్ చరణ్, నాగ చైతన్య, అడవి శేష్, సిద్దు జొన్నలగడ్డ, రాఘవేంద్రరావు, అశ్వినీదత్, అల్లు అరవింద్..ఇంకా పలువురు సినీ నటులు వచ్చారు. నందమూరి ఫ్యామిలీ సైతం హాజరైంది.

ఈ వేడుకలకు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్‌లకు సైతం ఆహ్వానం పంపారు. టి‌డి‌పి నేత టీడీ జనార్ధన్ వారిని ఆహ్వానించారు. మే 20న కార్యక్రమం జరిగింది. అదే రోజు జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు..దీంతో ఆయనకు వేడుకకు రావడానికి కుదరలేదు. దీనిపై పెద్ద రచ్చ జరిగింది. ఇదే క్రమంలో మహానాడు సందర్బంగా టీడీ జనార్ధన్ మాట్లాడుతూ..జూనియర్ శత జయంతి ఉత్సవాలకు ఎందుకు హాజరు కాలేదు వివరణ ఇచ్చారు.

జూనియర్ రాకపోవడంపై చర్చ ఏం లేదని, తాము పిలిచామని, తాము ఆహ్వానించడానికి ప్రయత్నిస్తే వారం రోజుల తర్వాత టైమ్ ఇచ్చారని, సరే అని వెళ్లి కలిసి విషయం చెప్పి ఆహ్వానించామని జనార్ధన్ చెప్పారు. “అయ్యో…. ఆల్రెడీ నేను ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకున్నానని ఎన్టీఆర్ చెప్పారని,  ‘బాబూ! బర్త్ డేలు చాలా వస్తాయి. అన్నగారి శత జయంతి ఒక్కసారే వస్తుందని చెప్పామని, దయచేసి ఏ మాత్రం వీలున్నారండి అని చెప్పామని, కానీ ఎన్టీఆర్ 22 మంది కుటుంబాలతో వెళుతున్నామని, ముందే అనుకున్నాను అని చెప్పారని టీడీ వివరించారు. మొత్తానికి ఎన్టీఆర్ ఎందుకు రాలేదో క్లారిటీ ఇచ్చి..ఒక వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version