6400 కోట్ల విషయం లో ప్రభుత్వానికి సూటి ప్రశ్న !!

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు చెల్లించాల్సిన జీతాల విషయంలో వ్యవహరిస్తున్న తీరుపై ప్రతిపక్ష పార్టీ టీడీపీ ఖండిస్తోంది. రెండు దఫాలుగా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించడం జరుగుతుందని ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై టిడిపి నాయకులు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది బడ్జెట్ లో 30 వేల కోట్లు పెరిగాయని…మరి ఇటువంటి టైములో ప్రభుత్వ ఉద్యోగులను ఇబ్బంది పెట్టకూడదు అంటూ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు నుంచి అచ్చెన్నాయుడు వరకు అందరూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.Chandrababu Naidu Requests CM Ys Jagan To Facilitate Praja Vedika ...ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఒక లెక్క పత్రాన్ని విడుదల చేసింది. అందులో ప్రభుత్వ బడ్జెట్ పెరిగిందని, 30 వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం నుండి అదనంగా వచ్చినట్లు తెలుగుదేశం పార్టీ లెటర్ లో చెప్పుకొచ్చింది. ఇటువంటి క్లిష్ట సమయంలో గత రెండు రోజుల్లోనే… కొంత మంది ప్రభుత్వ పెద్దలకు దగ్గర అయిన బడా కాంట్రాక్టర్లకు రూ. ఆరు వేల నాలుగు వందల కోట్లు చెల్లించారని మరి ఈ డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు.

 

విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెడుతూ, మరో పక్క ప్రజలను ఇబ్బంది పెడుతూ, ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాల విషయంలో ఈ విధంగా మొండిగా వ్యవహరించడం సరైన పద్ధతి కాదని తెలుగుదేశం పార్టీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. అన్ని వేల కోట్లు కాంట్రాక్టర్లకు ఇవ్వటం పైగా ఈ టైములో అవసరమా అంటూ వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అసలు కరోనా వైరస్ విషయంలో దేశంలో అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు చక్కగా ఎదుర్కొంటే ఏపీ ప్రభుత్వం మాత్రం సరిగ్గా ఎదుర్కోలేక పోయింది అంటూ టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news