ఆ సీటు కోసం టీడీపీ-జనసేన రచ్చ.!

-

టిడిపికి కంచుకోట లాంటి రామచంద్రాపురంలో ప్రస్తుతం పోటీ చేసే అభ్యర్థి కోసం వెతకాల్సిన పరిస్థితి వచ్చింది. 2019లో టిడిపి ఓడిపోయినా తెలుగుదేశం కార్యకర్తలు పార్టీని వీడలేదు. గత ఎన్నికల్లో తోట త్రిమూర్తులు టిడిపి తరఫున పోటీ చేసి వైసిపి ఎమ్మెల్యే వేణుగోపాలకృష్ణకు గట్టి పోటీ ఇచ్చారు. కేవలం 5000 ఓట్ల తేడాతో పరాజయం పొందారు. తర్వాత కొన్ని కారణాల వల్ల తోట త్రిమూర్తులు వైసీపీలో చేరడంతో రామచంద్రాపురంలో టిడిపి పరిస్థితి నావికుడు లేని నావలాగా తయారయింది.

ఇన్చార్జిగా నియమించడానికి కూడా నాయకుడు కరువైన పరిస్థితి టిడిపిది. కొన్నాళ్ల అన్వేషణ తర్వాత రెడ్డి సుబ్రహ్మణ్యంను టిడిపి ఇన్చార్జిగా నియమించారు. ఈయన టిడిపి కోసం చేసింది శూన్యమని టిడిపి నాయకులే అంటున్నారు. చంద్రబాబు నాయుడు అరెస్టు నేపథ్యంలో రాష్ట్రమంతా అరెస్టుకు నిరసనలు తెలిపితే రామచంద్రాపురంలో ఆశించినంత స్పందన మాత్రం రాలేదని రాజకీయ వర్గాలు అంటున్నాయి.

ప్రస్తుతం టిడిపి-జనసేన పొత్తు నేపథ్యంలో జనసేన రామచంద్రాపురం స్థానాన్ని కోరుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ అనూహ్యంగా టిడిపి మేడపాటి శేషారావును తెరమీదకి తీసుకువచ్చారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ గెలుపుకు సహకరించిన మేడపాటి శేషారావు తర్వాత వేణుగోపాలకృష్ణతో విభేదించి టిడిపిలో చేరారు. మేడపాటి శేషారావు సోదరులు ఎప్పటినుండో టిడిపిలోనే ఉన్నారు. శేషారావు ఆయన భార్యతో కలిసి టిడిపిలో చేరారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన శేషారావుకు వివాద రహితుడిగా పేరు ఉంది.

టిడిపి నిర్వహించిన రహస్య సర్వేలు కూడా శేషారావుకు అనుకూలంగా రావడంతో టిడిపి తమ అభ్యర్థిగా శేషారావు పేరును ప్రకటించింది. కానీ జనసేన కూడా ఈ స్థానంపై ఆసక్తి చూపించడంతో రామచంద్రపురం లో ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరా అని ఆసక్తి పెరుగుతుంది. రామచంద్రపురంలో టిడిపి జెండా ఎగురుతుందా? జనసేనకు చోటిస్తారా? ఇద్దరి మధ్య వైసీపీ పరిస్థితి ఏంటని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version