కాంగ్రెస్ దూకుడు..కారుకే లీడ్..కమలం థర్డ్.!

-

తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారిపోయాయి..మరో నాలుగు నెలల్లో ఎన్నికల షెడ్యూల్ రానుంది..డిసెంబర్ లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో గెలిచి అధికారం సొంతం చేసుకోవాలని బి‌ఆర్‌ఎస్, కాంగ్రెస్, బి‌జే‌పిలు ప్రయత్నిస్తున్నాయి. మూడు పార్టీలు తమ తమ వ్యూహాలతో ముందుకెళుతున్నాయి. అయితే ఇక్కడ బి‌జే‌పిని రేసులో నుంచి సైడ్ చేయవచ్చు. బి‌జే‌పి ఎంత చేసిన అధికారానికి కావల్సిన 60 సీట్లు గెలుచుకోవడం కష్టమనే పరిస్తితి.

అసలు ఆ పార్టీకి 60 స్థానాల్లో బలమైన అభ్యర్ధులు లేరు..ఏదో బలమైన అభ్యర్ధులు బట్టే ఆ పార్టీకి గెలుపు అవకాశాలు ఉంటాయి..బి‌జే‌పికి క్షేత్ర స్థాయిలో పెద్దగా బలం లేదు కాబట్టి..ఆ పార్టీ మూడో స్థానానికి పరిమితం అవుతుందని సర్వేలు చెబుతున్నాయి. దాదాపు 10 లోపే సీట్లు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. దీంతో ప్రధాన పోరు బి‌ఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్యే జరగనుంది. మొన్నటివరకు కాంగ్రెస్ సైతం రేసులో వెనుకబడి ఉంది..కానీ ఇప్పుడు అనూహ్యంగా కాంగ్రెస్ రేసులోకి దూసుకొచ్చింది. ఆ పార్టీలోకి పెద్ద ఎత్తున వలసలు కొనసాగుతున్నాయి.

దీంతో ఈ సారి తెలంగాణలో గెలవాలని చెప్పి కాంగ్రెస్ పట్టుదలతో ఉంది. కానీ ప్రస్తుత పరిస్తితుల్లో కాంగ్రెస్ కు ఇంకా బలం పెరగాలని తెలుస్తుంది. ప్రస్తుతం ఆ పార్టీకి 40 సీట్ల వరకే గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని సర్వేల్లో తేలింది. అటు బి‌ఆర్‌ఎస్ పార్టీకి ఇంకా ఆధిక్యం ఉందని తేలింది. ఆ పార్టీకి 55-60 సీట్లు వరకు గెలుచుకునే ఛాన్స్ ఉంది.

అంటే బి‌ఆర్‌ఎస్ పార్టీ ఆధిక్యంలో ఉందని చెప్పాలి. కానీ ఎన్నికల నాటికి పరిస్తితి ఎలా మారుతుందో చెప్పలేం. కాంగ్రెస్ ఇంకా పుంజుకుని, బి‌జే‌పి ఇంకా వెనుకబడితే..బి‌ఆర్‌ఎస్ పార్టీకి ఇబ్బంది. చూడాలి మరి ఎన్నికలనాటికి ఆధిక్యం ఎవరిది అవుతుందో.

Read more RELATED
Recommended to you

Exit mobile version