కారులో జంపింగ్‌లతో లొల్లి.. ఎవరు తగ్గట్లేదు!

-

రాజకీయాల్లో ఏ నాయకుడుకైన అధికారమే ప్రధాన లక్ష్యం. అధికారంలో ఉండటం కోసమే వారు రాజకీయం చేస్తారు. అయితే ప్రతిపక్షాల్లో ఉండే నేతలు అధికారం కోసమే.. అధికార పార్టీల్లో చేరుతుంటారు. ఇది సహజంగానే జరిగే ప్రక్రియ. రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికార పార్టీల్లోకి ప్రతిపక్ష నేతలు జంప్ చేస్తూనే ఉంటారు. ఇక తెలంగాణలో అధికార టీఆర్ఎస్‌లోకి ఇతర పార్టీల నేతలు ఏ స్థాయిలో చేరారో చెప్పాల్సిన పని లేదు.

TRS-Party | టీఆర్ఎస్
TRS-Party | టీఆర్ఎస్

మొదటి సారి అధికారంలోకి వచ్చినప్పుడు టీడీపీ, కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున టీఆర్ఎస్‌లో చేరారు. రెండోసారి అధికారంలోకి వచ్చాక కూడా చాలామంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో చేరారు. అయితే మొదటి సారి అధికారంలోకి వచ్చినప్పుడు టీఆర్ఎస్‌లో చేరికలు కలిసొచ్చాయి. పార్టీ బలోపేతానికి ప్లస్ అయింది. కానీ రెండోసారి అధికారంలోకి వచ్చాక నేతల ఓవర్ ఫ్లో ఎక్కువైంది. టీఆర్ఎస్‌లో నేతలు ఎక్కువ అయిపోయారు.

దీంతో జంపింగ్ నేతలు, టీఆర్ఎస్ నేతల మధ్య ఆధిపత్య పోరు మొదలైంది. దీంతో ఆయా నియోజకవర్గాల్లో నేతల మధ్య రచ్చ నడుస్తూనే ఉంది. ఉదాహరణకు చూసుకుంటే తాండూరులో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డిల వర్గాలకు ఏ మాత్రం పొసగడం లేదు. గత ఎన్నికల్లో రోహిత్ రెడ్డి కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి టీఆర్ఎస్‌లో చేరారు. దీంతో మహేందర్, రోహిత్ వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్తితి. అటు కొల్లాపూర్‌లో బీరం హర్షవర్ధన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి గెలిచి టీఆర్ఎస్‌లోకి వచ్చారు. దీంతో టీఆర్ఎస్‌లో ఉన్న జూపల్లి కృష్ణారావు వర్గానికి, హర్షవర్ధన్ వర్గానికి పడని పరిస్తితి. ఇక పాలేరులో ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావులకు పొసగడం లేదు. అటు పినపాకలో ఎమ్మెల్యే రేగా కాంతరావు, మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు పడని పరిస్తితి. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో జంపింగ్ ఎమ్మెల్యేలకు, టీఆర్ఎస్ నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తూనే ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news