ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో స్టానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలలో అధికార పార్టీ కి చెందిన 11 మంది ఎమ్మెల్సీ అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యారు. ఈ విషయాన్ని రాష్ట్ర ఎన్నికల ప్రధానా ధికారి విజయానంద్ అధికారికంగా ప్రకటించారు. అలాగే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు. వీరు అంతా.. 8 జిల్లా లో నుంచి ఏకగ్రీవం అయ్యారు. ఏకగ్రీవం అయిన వారి లో విజయనగరం నుంచి ఇందుకూరి రఘురాజు, విశాఖ నుంచి వరుదు కళ్యాణీ తో పాటు చెన్నుబోయిన శ్రీనివాసరావు ఉన్నారు.
అలాగే కృష్ణా నుంచి తలశిల రఘురామ్, మొండి తోక అరుణ్ కుమార్ ఉన్నారు. అలాగే అనంతపూరం నుంచి యల్లా రెడ్డి గారి శివరామిరెడ్డి ఉన్నారు. గుంటూర్ నుంచి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మురుగుడు హనుమంతరావు ఉన్నారు. తూర్పు గోదావరి నుంచి అనంత సత్య ఉదయ భాస్కర్ ఉన్నారు. అలాగే చిత్తూరు నుంచి కృష్ణ రాఘవ, జయేంద్ర భరత్ ఎన్నికయ్యారు. అలాగే ప్రకాశం నుంచి తూమటి మాధవరావు కూడా ఏకగ్రీవం గా ఎన్నిక అయ్యారు.