త్రిపురలో బీజేపీకి భారీ షాక్… కాంగ్రెస్ పార్టీలోకి ఇద్దరు ఎమ్మెల్యేలు

-

త్రిపుర రాష్ట్రంలో బీజేపీ పార్టీకి భారీ షాక్ తగిలింది. అధికారంలో ఉన్న బీజేపీ పార్టీకి సంబంధించిన ఇద్దరు ఎమ్మెల్యేలు సుదీప్ రాయ్ బర్మన్, ఆశిష్ కుమార్ సాహాలు తమ ఎమ్మెల్యే పదవులతో పాటు బీజేపీ పార్టీకి రాజీనామా చేశారు. దీంతో 60 అసెంబ్లీ స్థానాలు ఉన్న త్రిపురలో అధికార బీజేపీ – ఐపీఎఫ్టీ బలం 33కు పడిపోయింది. బీజేపీ నాయకత్వంపై ఆరోపణలు చేస్తూ ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేశారు.

తాజాగా సుదీప్ రాయ్ బర్మన్, ఆశిష్ కుమార్ సాహాలు ఈరోజు ఉదయం ఢిల్లీలోని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నివాసానికి వెళ్లారు. కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంకా గాంధీ కూడా రాహుల్ నివాసానికి వెళ్లడంతో వీరిద్దరు కూడా కాంగ్రెస్ లో చేరడం కన్ఫామ్ అయింది. 2018 ఎన్నికల్లో బీజేపీ పార్టీ త్రిపురలో అధికారంలోకి రావడానికి ఈ ఎమ్మెల్యేలు ఇద్దరు కూడా కీలకంగా పనిచేశారు. ఎన్నికలు మరో ఏడాదిలో జరుగనున్న సమయంలో ఎమ్మెల్యేలు పార్టీ మారడం బీజేపీ పార్టీకి పెద్ద షాక్.

Read more RELATED
Recommended to you

Exit mobile version