మాలోకంకు మంగళగిరి అనడం చేతకాదట… కానీ తెలుగు తెలిసిన ఉద్యమకారుడిలా మాట్లాడుతున్నాడని టీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడు, మాజీ మంత్రి నారా లోకేష్ వ్యవహరాన్ని తూర్పారపట్టాడు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. నిత్యం సోషల్ మీడియాలో తనదైన శైలీలో ప్రతిపక్ష పార్టీల నేతల వ్యవహారశైలీపై సెటైర్లు వేసే విజయసాయిరెడ్డి ఈ రోజు నారా లోకేష్‌ను మాలోకం అని సంభోదిస్తూ ట్వీట్టర్లో ట్వీట్ చేశారు. విజయసాయి రెడ్డి చేసిన ట్వీట్ ఇలా ఉంది.
సచివాలయం, మంగళగిరి, గుంటూరు అనే పేర్లు సరిగా పలకడమే రాని మాలోకం తెలుగు ఉద్యమకారుడిలా మాట్లాడుతున్నాడు. మా పిల్లలు ఇంగ్లిష్ మీడియంలో చదువుతారు. బడుగు బలహీన వర్గాల వారికి ఆ చదువులెందుకు అంటున్నాడు. వాళ్లు గ్రామాలు దాటి బయటకు రావద్దన్నది టిడిపి దుర్మార్గ కోరిక. అంటూ ట్వీట్ చేశారు విజయసాయిరెడ్డి. ఆయన పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువులు చదువుతుంటే.. పేద పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువ వద్దా అంటూ, వారు ఇంకా గ్రామాల్లోనే ఉండాలా అని లోకేష్ పై ఫైర్ అయ్యారు.
మరో ట్వీట్లో ఇలా రాసుకొచ్చారు విజయసాయిరెడ్డి. పేద పిల్లలు ఇంగ్లిష్ మీడియంలో చదివితే ఇక తెలుగు పేపర్లు ఎవరు కొని చదువుతారు అన్నది పచ్చ మీడియా ఆందోళన కాబోలు. బాబు అవినీతిని కప్పిపుచ్చి పాఠకుల మెదళ్లలోకి స్లో పాయిజన్ ఎక్కించే అవకాశం ఉండదని ఏడుపు. వీళ్ల కుటుంబాల్లోని పిల్లలు తెలుగు మాట్లాడటానికే ఇష్టపడరు.
తెలుగు భాషపై ఇంత రాద్దాంతం చేయడంపై తనదైన శైలీలో విరుచుకుపడ్డారు విజయసాయి. ఈ ట్వీట్లో టీడీపీకి బాసటగా నిలిచే న్యూస్పేపర్ల గురించి లౌక్యంగా కామెంట్ చేశారు. పేద పిల్లలకు తెలుగు రాకపోతే తెలుగులోని పేపర్లు ఎవరు చదువుతారు అని నర్మగర్భంగా ట్వీట్ చేశారు.