దేవ‌ర‌యంజాల్ భూముల చుట్టూ వేడెక్కుతున్న రాజ‌కీయాలు

-

టీఆర్ ఎస్ నేత‌ల‌కు మ‌రో కొత్త త‌ల‌నొప్పి త‌యారైంది. ఈట‌ల రాజేంద‌ర్ ను ఇరికించ‌డానికి వేసిన ఎత్తుగ‌డ తిర‌గ‌బ‌డి త‌మ నెత్తినే ప‌డింది. దేవ‌ర‌యంజాల్ భూముల్లో ఈట‌ల అక్ర‌మ క‌ట్ట‌డాల‌కు సంబంధించి అధికార పార్టీకి చెందిన ఓ ప‌త్రిక‌లో వ‌చ్చిన స‌ర్వే నెంబ‌ర్లు ఇప్పుడ కొంప‌ముంచాయి. ఈ స‌ర్వే నెంబ‌ర్ల ఆధారంగా ఎంపీ రేవంత్ రెడ్డి ఎవ‌రెవ‌రికి ఎక్క‌డెక్క‌డ భూములున్నాయో ఆధారాల‌తో చూపించి దుమారం లేపారు.

ఈ భూముల్లో మంత్రులు మ‌ల్లారెడ్డికి, కేటీఆర్ కు, దామోద‌ర్ రెడ్డికి, వారి బంధువుల‌కు కూడా క‌బ్జా భూములున్నాయ‌ని రేవంత్ రెడ్డి చెప్పారు. అక్క‌డితో ఆగ‌కుండా ఆ భూముల‌ను కూడా ప‌రిశీలిస్తూ నిజ‌నిర్ధార‌ణ క‌మిటీ పేరుతో మీడియాను కూడా తీసుకెళ్లి చూపిస్తున్నారు.

మంత్రి మ‌ల్లారెడ్డి ఆ భూముల వ‌ద్ద‌కురావాల‌ని అప్పుడే నిజాలు తెలుస్తాయ‌ని స‌వాల్ విసురుతున్నారు. అయితే ఈ వ్య‌వ‌హారం కాస్తా టీఆర్ ఎస్ మంత్రుల‌కు త‌ల‌నొప్పిగా మారింది. తాము వేసిన వ్యూహం బెడిసి కొట్టింద‌ని ఆందోళ‌న చెందుతున్నారు. ఇక వీటిపై విచార‌ణ జ‌ర‌పుతున్న క‌మిటీ కూడా ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి నివేదిక ఇవ్వ‌లేక చ‌తికిల‌బ‌డుతోంది. త‌మ చుట్టూ ఉచ్చు బిగుస్తోంద‌ని మ‌ల్లారెడ్డి తీవ్ర ఆందోళ‌న చెందుతున్న‌ట్టు తెలుస్తోంది. ఇక వీటిపై విచ‌రాణ క‌మిటీ ఎలాంటి రిపోర్టు ఇస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news