కేసీఆర్ ట్రిక్స్: బ్యాగ్రౌండ్ స్ట్రాటజీ అదేనా?

-

కేసీఆర్ ఎప్పుడు ఎలాంటి స్ట్రాటజీలతో ముందుకొస్తారో…ఎప్పుడు పోలిటికల్ గా ఊహించని ట్రిక్స్ ప్లే చేసి…ప్రత్యర్ధులని చిత్తు చేస్తారో చెప్పలేం…ఎప్పటికప్పుడు రాజకీయంగా బలపడటానికి ఆయన ఎలాంటి కొత్త ప్లాన్స్ తో రాజకీయం చేస్తారో ఎవరికి అర్ధం కాదు…ఇటీవల కాలంలో కూడా కేసీఆర్ చేసే రాజకీయం ఎవరికి అర్ధం కావడం లేదు…తెలంగాణలో బలమైన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ ని వదిలిపెట్టి….బలపడుతున్న బీజేపీని టార్గెట్ చేసి రాజకీయం నడిపిస్తున్నారు..అలాగే కేంద్రాన్ని బూచిగా చూపించి…మళ్ళీ రాజకీయంగా లబ్ది పొందడానికి చూస్తున్నట్లు కనిపిస్తున్నారు.

పైగా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో కలిసి…కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పాలని చూస్తున్నారు. ఇక తాజాగా కేసీఆర్ ఊహించని ఎత్తుతో ముందుకొచ్చారు..సమైక్యాంధ్ర కోసం పోరాటం చేసిన ఉండవల్లి అరుణ్ కుమార్ తో కేసీఆర్ తాజాగా భేటీ అయ్యారు…ప్రశాంత్ కిషోర్ గైడెన్స్ లో కేసీఆర్…టీఆర్ఎస్ పార్టీని జాతీయ పార్టీగా మార్చేందుకు వ్యూహాలు రచించడం మొదలుపెట్టారు.

తాజాగా టీఆర్ఎస్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) ఏర్పాటుపై చర్చించినట్లు తెలిసింది. పార్టీ విధానం కింద దక్షిణాది సెంటిమెంట్‌ను ప్రధానంగా తీసుకోవడానికి రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది..దక్షిణాది రాష్ట్రాలకు మోదీ పాలనలో జరిగిన అన్యాయాన్ని ప్రధానంగా తెరపైకి తీసుకెళ్లాలని చర్చించినట్లు సమాచారం. అంటే జాతీయ పార్టీ పెట్టి….బీజేపీకి చెక్ పెట్టాలనేది కేసీఆర్ ఆలోచనగా తెలుస్తోంది.

అయితే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వచ్చేది…మోడీకి చెక్ పెట్టేందుకు అని తెలుస్తోంది…కానీ పరోక్షంగా ఈయన రాజకీయాల వల్ల కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయని సమాచారం…కాంగ్రెస్ నేతలు ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. బీజేపీని బలోపేతం చేసే పనిలో కేసీఆర్‌ పడ్డారని, కాంగ్రెస్‌ లేకుండా దేశంలో ప్రత్యామ్నాయం సాధ్యం కాదని, బీఆర్‌ఎస్‌ పెట్టి.. తెలంగాణ రాజకీయాన్ని బీజేపీ చేతిలో పెట్టాలని కేసీఆర్‌ అనుకుంటున్నారన్నారని చెబుతున్నారు. అసలు కేసీఆర్ ట్రిక్స్ ఏంటో ఎవరికి అర్ధం కావడం లేదు..ఆయన టార్గెట్ ఏంటో క్లారిటీ రావడం లేదు…చూడాలి మరి చివరికి కేసీఆర్ వల్ల ఎవరికి నష్టం జరుగుతుందో.

Read more RELATED
Recommended to you

Exit mobile version