విజేత 2022 : యోగిలో క‌లిసొచ్చే ఆ.. 4 గుణాలు ఇవే..!

-

బ్రేవ్ – తిరుగులేనంత
బ్రిలియంట్ – కొల‌వలేనంత
ఎట్రాక్టివ్ – ఇత‌రుల పోటీ రానంత
యాక్టివ్ – ఎవ్వ‌రూ స‌రిపోల‌నంత
పై నాలుగు గుణాలూ క‌లిస్తే బాబా
యోగి అనే శ‌క్తి..తిరుగులేని చోద‌క శ‌క్తి

సుపరిపాలన, అభివృద్ధి అనే జంట లక్ష్యాల సాధనకు దృష్టి కేంద్రీకరించిన యోగి ఆదిత్య నాథ్ ఉత్తర ప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీకి తిరిగు లేని ఆధిక్యాన్నీ మ‌రియు విజ‌య సోపాన క్ర‌మాన్నీ సొంతం చేశారు. నిన్న‌టి వేళ వెలువడిన ఉత్తర ప్రదేశ్ ఎన్నికల ఫలితాలు త‌న పరిపాలనా దక్షతకు గీటురాయి అని నిర్థారింప‌జేశారు.

ఉన్మాదాన్ని రెచ్చగొట్టే రాజకీయాలపైనా, దారిద్రాన్నిఆదర్శీకరించే ధోరణుల మీద – సాధ్యా సాధ్యాల గీటురాయిపై నిగ్గు తేలిన రాజకీయ విధానాలు విజయం సాధించాయి. కేవలం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు యావత్ భారత దేశం సమష్టి ఆకాంక్షలకు అచ్చమైన మూర్తీభావంగా మెచ్చుతున‌క‌గా యోగి ఆదిత్యనాథ్ ను యావ‌త్ దేశం ముఖ్యంగా ఉత్త‌ర ప్ర‌దేశం గుర్తించి, స్థిర గౌర‌వాన్నే అందించింది. అందుకే ఈ విజ‌యం. అనూహ్యం. అనిత‌ర సాధ్యం.

ప్రపంచ వేదికలపై భారత దేశ స్థానాన్ని పునఃప్రతిష్టించే నేతగా యోగి ఎదిగారనడంలో ఎలాంటి సందేహం లేదూ.భారత్ దేశంపై అతి పెద్ద రాష్ట్రం ఉత్తర ప్రదేశ్ ప్రభావం చాలా ఉంటుంది.ఆ రాష్ట్ర పాలకులు బలమైన వారైతేనే దేశ భవిష్యత్తు బలంగా ఉంటుంది. దీనిని గుర్తించిన భారతావని ఆశలను ఉత్తర ప్రదేశ్ ప్రజలు గ్రహించారు.యోగి ఆదిత్యనాథ్ ను నెత్తిన పెట్టుకున్నారు.

దశాబ్దాలుగా కుచించుకు పోయిన ఆర్థిక ప్రగతి ప్రభావంలో గిలగిల లాడుతున్న ఉత్తర ప్రదేశ్ కు బలమైమన నాయకత్వం అందించిన మహోన్నత వ్యక్తి యోగి ఆదిత్యనాథ్. తన ఐదేళ్ల పరిపాలనలో ఇప్పటి వరకూ కుంభకోణాలతో కళంకిత రాజకీయ వ్యవస్థలో సమూలమైన మార్పులు తెచ్చిన ధీశాలి యోగి.. ఒక్క మాటలో చెప్పాలంటే స్వాతంత్యం వచ్చినప్పటి నుంచి ఇటీవలి కాలం వరకూ కాంగ్రెస్ పార్టీ అనుసరించిన మైనారిటీలను బుజ్జగించే లౌకిక వాదాన్నితిరస్కరించేందుకు ఓ విధానాన్ని తీర్చి దిద్దారు. లౌకికవాదం అనే పదానికి సరైన నిర్వచనం చెప్పిన మహోన్నత వ్యక్తి యోగి ఆదిత్యనాథ్.

యోగి ఆదిత్యనాథ్ ను దేశ విదేశాలలో ఉండే భారతీయులు బ్రిలియంట్ అంటూ కితాబిస్తుంటారు. దీనికి ప్రత్యేక కారణం ఉంది. ఆర్థిక ప్రణాళికలకు కీలక ప్రాధాన్యం సంతరింప జేశారు. జాతి పునర్ నిర్మాణంలో ఆయన రెండవ మౌలికాంశంగా ఉండింది కూడా. నిరాశ నిస్పృహలతో కుంగిపోయి ఉన్న యువతకు ఉత్తేజ పరిచే విధానాలను అనుసరించి,ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి అండగా నిలిచారు. ఈ చర్యలే ఆయనకు చారిత్రాత్మక విజయాన్ని మరోసారి సొంతే చేసుకోవడానికి దోహద పడింది.

యోగీలో చాలా కొద్ది మందికి తప్ప మరెవరికీ కనిపించని గుణం ఒకటుంది. యోగి ఎవరికీ విధేయుడుగా ఉండే వ్యక్తి కాదు. నియంతగా వ్యవహరించే వ్యక్తి కూడా కాదు. ఇవే ఆయనలోకి అట్రాక్షన్ ఫ్యాక్ట‌ర్. అవ‌స‌రం అయిన వేళ అవ‌స‌రం మేర‌కు విధేయతను ప్ర‌ద‌ర్శించి కచ్ఛితమైన ఫలితాలనూ ఆశించే వ్యక్తి. సాధించే వ్య‌క్తి కూడా ! యోగిని ఎన్నుకున్న ఓటర్లు ఆయన నుంచి కేవలం నాయకత్వాన్ని మాత్రమే కాదు. క్రియాశీలతను కూడా ఆశించారు. ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన నాటి నుంచి యోగి ఆదిత్యనాథ్ ప్రజలకు సన్నిహితమైన పాలన సాగించడంలో తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు. వైకుంఠ పాళిని తలపించే రాజకీయ క్రీడలో మూలాల నుంచి అవినీతిని తొలగించేందుకు యోగి గట్టి ప్రయత్నమే చేశారు.. ప్రజల క్షేమం కోసం ఎటువంటి నేతలనైనా పక్కన పెట్టేందుకు ఆయన జంక లేదు. వెనుకంజ వేయ‌లేదు.

చురుకుగా స్పందేంచే వైఖరే యోగి ఆదిత్యనాథ్ విజయానికి కీలకంగా మారింది. ప్రభుత్వ వ్యతిరేతను జయించారు కూడా. ఒక్కటి మాత్రం నిజం ఉత్తర ప్రదేశ్ లోనే కాదు, యావత్ భారతావనిలో మరికొన్నాళ్ల పాటు యోగి ఆదిత్యనాథ్ హవా కొనసాగనుందనడంలో సందేహాల‌కు తావేలేదు. ఫ‌ర్ దిస్ దేర్ ఈజ్ నో సెకండ్ థాట్.. మిస్ట‌ర్ యోగీ జీతే ర‌హో ల‌గే ర‌హో చ‌ల్తే ర‌హో ! జేజేలు బాబా (baba) ( బీ ఫ‌ర్ బ్రేవ్ బీ ఫ‌ర్ బ్రిలియంట్ ఎ ఫ‌ర్ అట్రాక్టివ్ అండ్ ఎన‌ద‌ర్ ఎ ఫ‌ర్ ఎటెంటివ్)

– వెన్నెల కంటి శ్రీధర్, సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్, నెల్లూరు

Read more RELATED
Recommended to you

Exit mobile version