యనమల.. తునిని వదిలేసుకున్నట్లేనా?

-

చాలా మందిని రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారయ్యా అని అడిగితే… ప్రజాసేవ కోసం, ప్రజాసేవలో తరించడం కోసం, ప్రజాసేవ చేస్తూనే కన్నుమూయడం కోసం అన్న రేంజ్ లో కబుర్లు చెబుతుంటారుకానీ… తీరా ఏరు దాటాక కానీ వాళ్ల అసలు రంగు బయట పడదు. ఇందుకు ఉదాహరణగా నిలుస్తున్నారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు! ఆరుసార్లు గెలిపించిన నియోజకవర్గాన్ని… కరోనా సమయంలో కూడా కనీసం కన్నెత్తి కూడా చూడకుండా.. లక్ష రూపాయలు విరాళం ఇచ్చి.. మీకు ఇది చాలు అన్న చంధంగా నియోజకవర్గ ప్రజలను అవమాన పరిచారు.. రాజకీయాలంటే ఇలాగే ఉంటాయని తుని నియోజకవర్గ ప్రజలకు చెప్పకనే చెప్పారు!!

తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు తర్వాత తానే సెకండ్ ప్లేస్ అన్న స్థాయిలో హడావిడి చేస్తుంటారు యనమల రామకృష్ణుడు! నాడు నందమూరి తారకరామారావు హయాం నుంచి కూడా టీడీపీలో యనమలకు నడుస్తూనే ఉంది. యనమల ఆలోచనలకు కూడా చంద్రబాబు అదే స్థాయిలో వెనకేసుకొస్తూ, వెనకాలే తిప్పుకుంటారు! ఆ సంగతులు అలా ఉంటే… ఇక యనమల ప్రత్యక్ష రాజకీయాలకు శాస్వతంగా దూరం అవుతారనే పుకార్లు బలంగా వినిపిస్తున్నాయి. ఇందుకు సాక్ష్యంగా నిలుస్తున్నారు తుని నియోజకవర్గ ప్రజలు… ఎందుకంటే ఇక్కడి నుంచి సుమారు ఆరుసార్లు ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యి కీలకమైన మంత్రి పదవులను అనుభవించారు మరి! అలాంటిది వారికి కాక మరెవరికి తెలుస్తుంది!?

ఎన్నికల అనంతరం కానీ.. అసలు ఈ కరోనా సమయంలో కానీ ఇన్ని సార్లు గెలిపించిన ఈ నియోజకవర్గ ప్రజలు ఎలా ఉన్నారనే ద్యాసే యనమలకు లేదని తుని నియోజకవర్గ ప్రజలు ఫైరవుతున్నారు. పదేళ్లుగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్న యనమల… ఇంక ప్రజావసరం తనకు లేదనుకున్నారో ఏమో కానీ… ఇది తనకు రాజకీయ బిక్ష పెట్టి, ఆర్ధిక శాఖా మంత్రిగా నిలబెట్టిన నియోజకవర్గం అన్న విషయం మరిచారని నియోజకవర్గ ప్రజలు నిప్పులు చెరుగుతున్నారు. లాక్ డౌన్ సమయంలో వైకాపా ఎమ్మెల్యేలు అంతా జనాల్లోనే ఉంటూ.. అందరికీ నిత్యవసర వస్తువులు అందేలా అన్ని ఏర్పాట్లూ చేస్తూ, పర్యవేక్షిస్తూ ఉంటే… తాను మాత్రం ఒక లక్ష రూపాయలు విరాళం ఇచ్చి.. తన బాధ్యత ముగుసిందనుకున్నారని తుని ప్రజలు మండిపడుతున్నారు.

ప్రెస్ మీట్ లు పెట్టడం, ట్విట్టర్ లో కామెంట్లు పెట్టడం, అధికారపార్టీపై నోరేసుకుని పడిపోవడం వల్ల ప్రత్యేకంగా ప్రజలకు ఒరిగేది ఏమీ లేదని.. ఇలాంటి సమయంలో ప్రజలకు “నేనున్నా” అనే భరోసా కల్పించాలని.. అలాంటి వ్యక్తే అసలైన నాయకుడని తుని నియోజకవర్గ ప్రజలు ఈ సందర్భంగా అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా… నియోజకవర్గంలో ఇంత బలమైన నేతగా ఎదిగిన యనమల… ఇవాళ ప్రజలంతా చీత్కరించుకునే స్థాయికి దిగజారిపోవడం వెనక అవకాశవాద రాజకీయమే తప్ప.. మరొకటి కారణం కాదని మరికొందరి అభిప్రాయంగా ఉంది!

Read more RELATED
Recommended to you

Latest news