ఎస్సీ కోటల్లో వైసీపీ తగ్గట్లేదు.. టీడీపీకి మళ్ళీ దెబ్బే.!

-

జగన్ ఎప్పుడు తమది పేదల ప్రభుత్వమని చెబుతూ ఉంటారు. తాను పేదల కోసం పనిచేస్తానని, నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనారిటీలు అంటుంటారు. అయితే ఇందులో వాస్తవం ఉంది. ఆ వర్గాలు జగన్ వైపే ఉన్నారు. జగన్ ఆ వర్గాల వారికి పథకాల రూపంలో బటన్ నొక్కి చాలా మేలు చేస్తున్నారు. అందుకే ఆ వర్గాల ప్రజలు జగన్ కే మద్ధతు ఇస్తున్నారు. ఇందులో ఎస్సీ వర్గం గురించి మాట్లాడుకుంటే..వారు మొదట్లో కాంగ్రెస్, ఇప్పుడు వైసీపీకి మద్ధతుగా ఉన్నారు.

రాష్ట్రంలో ఎస్సీ వర్గం ప్రభావం చూపించే నియోజకవర్గాలు చాలానే ఉన్నాయి. ఇక అందులో ఎస్సీ రిజర్వ్ సీట్లలో వైసీపీ ఎప్పుడు సత్తా చాటుతూనే ఉంది. రాష్ట్రంలో 29 ఎస్సీ రిజర్వ్ సీట్లు ఉన్నాయి. ఆ 29 సీట్లలో వైసీపీకి బలం ఉంది. గత ఎన్నికల్లో 29 సీట్లలో వైసీపీ 27, టి‌డి‌పి 1, జనసేన 1 సీటు మాత్రమే గెలుచుకుంది. జనసేన నుంచి గెలిచిన ఎమ్మెల్యే వైసీపీ వైపుకు వచ్చేశారు. దీంతో వైసీపీ బలం 28కి చేరుకుంది.

 

మరి వచ్చే ఎన్నికల్లో కూడా ఎస్సీ సీట్లలో వైసీపీ సత్తా చాటుతుందా? అంటే అందులో ఎలాంటి డౌట్ లేదనే చెప్పాలి. కాకపోతే గత ఎన్నికల మాదిరిగా అన్నీ సీట్లు రావడం అనేది కాస్త కష్టమైన విషయం. అయితే ఆధిక్యం మాత్రం వైసీపీకే ఉండనుంది. టి‌డి‌పి-జనసేన కలిస్తే ఆ ప్రభావం వల్ల విశాఖ, గోదావరి జిల్లాల్లో ఎస్సీ సీట్లలో వైసీపీ విజయం కాస్త కష్టం కావచ్చు. ఇక కృష్ణా, గుంటూరు జిల్లాల్లో టి‌డి‌పికి కాస్త పట్టు కనిపిస్తుంది. ఈ జిల్లాలు మినహాయిస్తే మిగిలిన జిల్లాల్లోని ఎస్సీ సీట్లలో వైసీపీ హవా కొనసాగనుంది. మళ్ళీ వైసీపీకే ఆధిక్యం దక్కనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version