రాష్ట్రంలో ఎన్నికల గాలి ఎటు వైపైన ఉందని.కానీ కొన్ని స్థానాల్లో మాత్రం వైసీపీదే హవా అని చెప్పాలి. అందులో ఎలాంటి డౌట్ లేదని చెప్పాలి. కొన్ని సీట్లలో వైసీపీ ఆధిక్యం ఉంది. అలా వైసీపీ హవా ఉన్న సీట్లలో ఎస్సీ స్థానాలు కూడా ఉన్నాయి. రాష్ట్రంలో మొత్తం 29 స్థానాలు ఉన్నాయి. అందులో వైసీపీకి తిరుగులేదని చెప్పాలి.
గత రెండు ఎన్నికల్లో వైసీపీ హవా నడుస్తుంది. గత ఎన్నికల్లో 29 స్థానాల్లో వైసీపీ 27 స్థానాల్లో గెలిచింది. టిడిపికి కేవలం ఒక సీటు వచ్చింది, అటు జనసేన ఒక సీటు గెలిచింది. అంటే గత ఎన్నికల్లో ఎస్సీ స్థానాల్లో వైసీపీ హవా ఎలా నడిచిందో తెలిసిందే. అలాంటి సీట్లలో ఇప్పుడు పట్టు సాధించాలని టిడిపి చూస్తుంది. అయితే కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత టిడిపికి బాగా కలిసొచ్చింది. దీంతో టిడిపికి నిదానంగా పట్టు పెరుగుతూ వచ్చింది.
ఇదే సమయంలో వైసీపీ అన్నీ స్థానాల్లో గెలుస్తుందని, అందులో డౌట్ లేదని, టిడిపికి ఒక్క సీటు కూడా రాదని వైసీపీ నేతలు సవాల్ చేస్తున్నారు. చంద్రబాబు దళిత ద్రోహి అని వైసీపీ ప్రచారం చేస్తుంది. ఇక ఉన్నవి లేనివి క్రియేట్ చేసి టిడిపిని దెబ్బతీసే విధంగా వైసీపీ దళిత కార్డు వాడుతుంది. వైసీపీకి చెక్ పెట్టాలని టిడిపి చూస్తుంది. ఈ క్రమంలోనే ఎస్సీ స్థానాలపై టిడిపి గురి పెట్టింది.
ప్రస్తుతం ఉన్న పరిస్తితులని చూస్తుంటే కొన్ని ఎస్సీ స్థానాల్లో వైసీపీకి సీన్ రివర్స్ అవుతుంది. కొన్ని సీట్లలో టిడిపి బలపడుతుంది. ఈ పరిణామాలు వైసీపీకి మైనస్ అవుతున్నాయి. మొత్తం 29 స్థానాలు ఉంటే..టిడిపికి దాదాపు 10 సీట్లపైనే పట్టు వచ్చింది. కాకపోతే ఇప్పటికీ వైసీపీ ఆధిక్యం ఉంది గాని..టిడిపి నిదానంగా బలపడటంతో వైసీపీకి చెక్ పడే ఛాన్స్ ఉంది.