కొండవీడులో బీసీ కులానికి చెందిన రైతు కోటయ్యను మీరే చంపేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. అతడిని తీవ్రంగా కొట్టి కొన ఊపిరితో ఉన్న ఆ రైతును అమానుషంగా అక్కడే వదిలేశారు. మీ హెలికాప్టర్ దిగటానికి ఆయన బొప్పాయి పొలాన్ని నాశనం చేశారు. మానవత్వం చూపాల్సిన సందర్భాల్లో ఈ రాక్షసత్వం ఏంది చంద్రబాబు.. అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.
అసలేంజరిగిందంటే.. ముఖ్యమంత్రి సభ కోసం కోటయ్య అనే రైతుకు చెందిన బొప్పాయి పండ్ల తోట, పూల తోటను ధ్వంసం చేశారు. రైతును తన పొలంలోకి పోనీయకుండా పోలీసులు అడ్డుకున్నాడు. తీవ్రంగా కొట్టారు. దీంతో ఆ రైతు తీవ్ర గాయాలతో నేలకొరిగాడు. కొన ఊపిరితో ఉన్న తన తండ్రిని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు అనుమతించాలంటూ ఆ రైతు కొడుకు పోలీసులను ఎంత వేడుకున్నా.. ముఖ్యమంత్రి వస్తున్నారంటూ పోలీసులు అనుమతివ్వకపోవడంతో ఆ రైతు అక్కడే మృతి చెందాడు.
కొండవీడులో ఒక బీసీ(ముత్రాసి) రైతు, కోటయ్య గారిని మీరే చంపేశారు ముఖ్యమంత్రి గారూ @ncbn. కొట్టి కొనఊపిరితో వున్న రైతును అమానుషంగా అక్కడే వదిలేశారు. మీ హెలికాప్టర్ దిగటానికి ఆయన బొప్పాయి పొలాన్ని నాశనం చేశారు. మానవత్వం చూపాల్సిన సందర్భాల్లో ఈ రాక్షసత్వం ఏమిటి చంద్రబాబు గారూ?
— YS Jagan Mohan Reddy (@ysjagan) February 19, 2019