ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీకే ఎక్కవశాతం ఓటర్లు జైకొడతారనేది సర్వేలు చెప్తున్న మాట.దానికి తగినట్లుగానే ఏపీలో ఏ ఎన్నికలు నిర్వహించినా అధికార పార్టీ హవా కొనసాగుతోంది. శనివారం రాష్ట్రంలో కొన్ని పంచాయతీలకు జరిగిన ఎన్నికల్లోనూ వైసీపీ విజయదుందుభి మోగిచింది.ప్రతిపక్ష టీడీపీకి అవకాశం లేకుండా ఏకపక్ష విజయాలను సొంతం చేసుకుంది.మరోసారి మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుని సీఎం జగన్‌కి తిరుగులేదనే సంకేతాలను ప్రజల్లోకి బలంగా పంపింది.గడిచిన నాలుగేళ్లలో ఆంధ్రప్రదేశ్ లో ఏ ఎన్నికలు జరిగినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏకపక్ష విజయాలను సొంతం చేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది.
2019 సార్వత్రిక ఎన్నికల్లో 151 శాసనసభ , 22 లోక్ సభ స్థానాలు సాధించిన వైఎస్సార్ కాంగ్రెస్ ఆ తరువాత జరిగిన మున్సిపల్, పంచాయతీ, జిల్లాపరిషత్, సహకార సంఘాల ఎన్నికల్లో అదే జోరును చూపించింది. ఇక గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల ఉప ఎన్నికల్లోనూ ఫ్యాన్ జోరు స్పష్టంగా కనిపించింది. ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఉంది, ఈసారి మేం అధికారంలోకి రావడం ఖరారైంది అని చెప్పుకున్న తెలుగుదేశం, జనసేన పార్టీలు బలపరిచిన అభ్యర్థులు ఈ ఎన్నికల్లో ఘోరంగా ఓడాయి. రాష్ట్ర వ్యాప్తంగా 66 సర్పంచు పదవులకు ఎన్నికలు జరిగితే అందులో 53 స్థానాలు వైసీపీ గెలుచుకుంది.పది చోట్ల టీడీపీ ఒకచోట జనసేన అభ్యర్థులు విజయం సాధించారు. ఇక 1062 వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు జరిగితే ఏకగ్రీవాలతో కలిసి 810 స్థానాల్లో వైసీపీ బలపరిచిన అభ్యర్ధులు విజయం సాధించగా తెలుగుదేశం 182 స్థానాలు,జనసేన ఏడు స్థానాలతో సరిపెట్టుకుంది.
వైనాట్ 175 అంటున్న వైసీపీ కుప్పం,హిందూపురంలోనూ హవా కొనసాగించింది. చంద్రబాబు సారధ్యం వహిస్తున్న కుప్పంలో ఆరు వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు జరిగితే చంద్రబాబు ఇప్పుడు ఇల్లు నిర్మిస్తున్న శాంతిపురం మండలం, శివపురం వార్డ్ సైతం వైసిపి ఖాతాలోకి వెళ్లాయి. బాలయ్యబాబు ఎమ్మెల్యేగా ఉన్న హిందూపురంలో చలివెందుల పంచాయతీ సర్పంచ్ స్థానం వైసీపీ ఖాతాలో పడింది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుస్తామని చెప్పుకుంటున్న తెలుగుదేశం పార్టీకి ఈ తాజా ఫలితాలు చెంపపెట్టుగా మారాయి.ఇక ముందు టీడీపీ అగ్రస్ గల్లంతు కాక తప్పదని ఈ ఫలితాలను బట్టి రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.
ఏపీలో ఏ జిల్లాలో చూసినా వైసీపీ స్పష్టమైన ఆధిక్యాన్ని చూపిస్తోంది. జిల్లా,ప్రాంతం అనే తేడా లేకుండా ఏపీ నలుచెరుగులా వైసీపీ విజయబావుటా ఎగురవేస్తూ దూసుకుపోతోంది. సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు,నూతన పరిశ్రమల రాకతో ఉపాధి అవకాశాల కల్పన వంటి అంశాలు వైసీపీ విజయానికి ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. నేరుగా గడప దగ్గరకే సంక్షేమ ఫలాలను చేరవేస్తున్నయ ప్రభుత్వానికే ప్రజలు జైకొడుతున్నారనేది మరోసారి రుజువైంది. ఈ తాజా ఫలితాలో తెలుగుదేశం,జనసేన పార్టీలు అంతర్మథనంలో పడినట్లయింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లోనూ ఫ్యాన్ జోరు తప్పదని అటు నిపుణులు కూడా చెప్తున్నారు.