మరొకసారి ట్రోలర్స్ కు గట్టి కౌంటర్ ఇచ్చిన పూనమ్ కౌర్..?

-

ప్రముఖ హీరోయిన్ పంజాబీ ముద్దుగుమ్మ పూనమ్ కౌర్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈమె చేసింది తక్కువ సినిమాలే అయినా.. ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా మిగిలిపోయింది. తన అందంతో, నటనతో, ముఖ కవళికలతో ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకున్న పూనమ్ కౌర్ ఎక్కువగా ఇటీవల కాలంలో వివాదాలలో తరచూ చిక్కుకుంటుందని చెప్పవచ్చు. తెలుగు , తమిళ్లో కొన్ని సినిమాలలో నటించిన ఈమె హీరోయిన్ గా పలు సినిమాలలో కనిపించింది. ఆ తర్వాత సైడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా మెరిసింది. తెలుగులో చివరిగా నాయకి అనే సినిమాలో కనిపించింది పూనమ్ కౌర్. నిజానికి సినిమాలలో ఎక్కువగా కనిపించకపోయినా సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ హాట్ టాపిక్ గా మారుతూ ఉంటుంది. ఇక కేవలం ఈమె వివాదాల ద్వారానే కాకుండా హాట్ హాట్ ఫోటోలతో కుర్రకారు మతులు పోగోడుతోందని చెప్పవచ్చు.

ఇకపోతే గతంలో స్టార్ హీరోల అభిమానుల నుంచి వార్నింగ్స్ కూడా ఎదుర్కొన్న ఈ ముద్ద గుమ్మ తాజాగా మహిళల డ్రెస్సింగ్ గురించి అసభ్యకరంగా మాట్లాడే వారిపై తనదైన శైలిలో మండిపడింది. సోషల్ మీడియా వేదికగా ఆడవాళ్ళ డ్రెస్సింగ్ పై కామెంట్ చేసే నేటిజన్స్ కు గట్టిగా వార్నింగ్ ఇచ్చిందని చెప్పవచ్చు..ఇకపోతే ఆడవాళ్లు వేసుకునే డ్రెస్సులు కారణంగానే అత్యాచారాలు జరుగుతున్నాయని.. కొంతమంది అంటూ ఉంటారు . ముందుగా ఈ విషయం గురించి మాట్లాడేవారు నిండుగా దుస్తులు ధరించిన మహిళలపైనే అత్యాచారాలు ఎక్కువగా జరుగుతున్నాయని గుర్తించాలి..

నేను కూడా నాకు కంఫర్ట్ గా ఉండే దుస్తులను మాత్రమే ధరిస్తాను.. బుర్కా వేసుకుంటాను.. చీర కట్టుకుంటాను.. అలాగే బీచ్ కి వెళ్ళినప్పుడు బికినీ కూడా వేసుకొని తిరుగుతాను .. మీకు లిమిట్స్ క్రాస్ చేసే హక్కు లేదు.. నాకు నచ్చిన విధంగా.. నాకు కంఫర్ట్ గా ఉండే దుస్తులు వేసుకునే హక్కు నాకు ఉంది. ఇక దుస్తుల గురించి.. ఇలా ఆడవారిని మానసికంగా హింసించడం ఏమాత్రం బాగాలేదు అంటూ నేటిజన్స్ అలాగే ట్రోలర్స్ పై కొంచెం ఘాటుగా స్పందించింది ఈ ముద్దుగుమ్మ.

Read more RELATED
Recommended to you

Exit mobile version