పిపీఎఫ్ స్కీమ్.. రూ.300 పెట్టుబడితో రూ.2.36 కోట్ల ఆదాయం.. ఎలాగంటే?

-

ప్రభుత్వం భరోసా కల్పిస్తూ ప్రముఖ బ్యాంకులు, పోస్టాఫీస్ లలో అందించే స్కీమ్ ఇది.. ఒక్కసారి ఇందులో పెట్టుబడి పెడితే 15 ఏళ్ల వరకూ విత్‌డ్రాకు అవకాశం ఉండకపోవడంతో ధీర్ఘకాలిక పెట్టుబడిదారులు ఈ పథకంలో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతూ ఉంటారు..ఈ పథకం జనాలకు ట్రిపుల్ పన్ను ప్రయోజనాలను అందిస్తుంది..ఇక ఈ అకౌంట్ లో ఏడాదికి రూ.1.5 లక్షల వరకూ పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పెట్టుబడి ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపును క్లెయిమ్ చేయవచ్చు. అలాగే ఈ పథకంలో పొందిన వడ్డీతో పాటు మెచ్యూరిటీపై విత్‌డ్రా చేసే మొత్తం కూడా పన్ను రహితంగా ఉంటుంది..

పీపీఎఫ్ ఖాతా 15 సంవత్సరాల్లో మెచ్యూర్ అయినప్పటికీ పెట్టుబడిదారులు 5 సంవత్సరాల బ్లాక్‌లలో ఖాతాను పొడిగించడానికి మరియు ఆ సమయంలో వర్తించే వడ్డీ రేటును పొందేందుకు అనుమతిస్తారు. ఇందులో పెట్టుబడి పెట్టి కోటి వరకు ఆదాయాన్ని పొందవచ్చు.. ఉదాహరణకు నెలవారీ రూ.9000 పెట్టుబడితో ప్రస్తుతం ఉన్న 7.1 శాతం వడ్డీ రేటుతో 15 సంవత్సరాల్లో రూ. 29.2 లక్షలకు పెరుగుతుంది . ఇలా రోజుకు కేవలం రూ. 300 పొదుపు చేస్తే నెలాఖరులో పీపీఎఫ్ ఖాతాలో పెట్టుబడి పెట్టేందుకు పెట్టుబడిదారుడికి రూ.9000 లభిస్తుంది. అయితే, జీతం పొందే ఉద్యోగులు పీపీఎఫ్‌కి బదులుగా వారి వీపీఎఫ్ ఖాతాలో ఎక్కువ మొత్తాన్ని పెట్టుబడి పెట్టడం మంచిది.

ఈ పథకంలో 20 సంవత్సరాల పాటునెలకు రూ. 9000 పెట్టుబడి పెట్టడం ద్వారా మొత్తం మెచ్యూరిటీ మొత్తం రూ. 47.9 లక్షలు, 7.1% వడ్డీతో 25 సంవత్సరాలలో రూ. 74.2 లక్షలుగా ఉంటుంది. 30 ఏళ్లలో మీరు నెలకు రూ. 9000 పెట్టుబడిని కొనసాగిస్తే, మెచ్యూరిటీ మొత్తం రూ. 1.11 కోట్లు కావచ్చు. అయితే నెలకు రూ. 9000 సహకారంతో పీపీఎఫ్‌ ఖాతా 40 ఏళ్లలో రూ. 2.36 కోట్లకు చేరుతుంది. అయితే 7.1% వడ్డీతో 35 ఏళ్లలో రూ. 1.63 కోట్లకు పెరగవచ్చు..ఈ పథకాన్ని 20 ఏళ్ల నుంచే ప్రారంభిస్తే 60 ఏళ్ల వరకు మంచి ఆదాయాన్ని పొందుతారు.. పన్ను మినహాయించి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి..

Read more RELATED
Recommended to you

Exit mobile version