దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్న పద్ధతిని ఇప్పుడు పొలిటికల్ స్ట్రాటిజిస్ట్ అయిన ప్రశాంత్ కిషోర్ చాలా చక్కగా పాటిస్తున్నారు. దేశంలో ఎంతోమంది పొలిటికల్ స్ట్రాటిజిస్ట్ లు ఉండొచ్చు కానీ ప్రస్తుతానికి ప్రశాంత్ కిషోర్ మాత్రమే తోపు. చాలా స్ట్రాటీజిస్ట్ గా అతని సంస్థ చేస్తున్న పనులతో రాష్ట్రంలో వారు కలిసి పని చేసే పార్టీలకు అధికారం ఈజీగా వచ్చేస్తోంది. ఉత్తరాది నుంచి దక్షిణాదిన ఉన్న ఢిల్లీ దాకా ఆయన వ్యూహం ఫలితం ఎన్నికల్లో అన్ని పార్టీలు వ్యక్తులు అనూహ్య ఫలితాలు సాధించారు.
ఆంధ్రప్రదేశ్లో వైయస్ జగన్, మహారాష్ట్రలో శివసేన, ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ ఘనవిజయం సాధించడంతో పాటు గతంలో ప్రధానిగా నరేంద్ర మోడీ ఎన్నికలలో విజయం సాధించడంలో అతని పాత్ర భారీగా ఉండడంతో అందరి దృష్టి అతనిపై పడింది. తాజాగా పీకే ను మాజీ ప్రధానమంత్రి దేవగౌడ, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కూడా ఆహ్వానిస్తున్నారు. కర్ణాటకలో కొన్ని కుట్రలతో అధికారం నుంచి దూరమైన కుమారస్వామి ఈసారి ఎన్నికల ద్వారానే అధికారంలోకి రావాలని భావిస్తున్నారు. అలాగే పశ్చిమ బెంగాల్ లో మమతాబెనర్జీ, తమిళనాడులో డీఎంకే కు ప్రశాంత్ కిషోర్ కలిసి పని చేస్తున్నట్టు.
ఇటువంటి పరిస్థితుల్లో 2024 ఎన్నికల్లో జగన్ కోసం మళ్లీ పని చేసేందుకు ప్రశాంత్ కిషోర్ కి అసలు సమయం ఉంటుందా అన్నది ఇప్పుడు అందరి ప్రశ్న. దేశంలోనే మోస్ట్ వాంటెడ్ పర్సన్ గా మారిన ప్రశాంత్ కిషోర్ దాదాపుగా ఈసారి తన సేవలను జగన్ కు అందించకపోవచ్చు. ప్రశాంత్ కిషోర్ విలువను దేశానికి తెలియజేసిన జగన్ ఇప్పుడు అతని విజయవంతమైన కెరీర్ వల్ల పీకే లాంటి టాలెంటెడ్ వ్యక్తిని కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి అప్పటి జరగబోయే ఎన్నికల సమయంలో ప్రశాంత్ కిషోర్ ఏ పని ఉన్నా వదిలేసి జగన్ కోసం మళ్లీ పని చేస్తాడా లేదా అన్న విషయం చూడాలి.