షాకింగ్ : పెళ్లయిన మూడు రోజులకే ప్రెగ్నెంట్.. !

-

మన సమాజంలో కిలాడీ లేడీ ల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కిలాడి లేడి లకు సంబంధించి రోజుకో ఘటన బయటపడుతోంది. దీంతో అమాయక యువకులు దారుణంగా మోసపోతున్నారు. డబ్బు కోసం ఒకరి తర్వాత ఒకరిని పెళ్లి చేసుకుంటూ… యువకులను దారుణంగా మోసం చేస్తున్న సంఘటనలు గత కొద్ది నెలల్లో అనేకం వెలుగుచూశాయి. ఇక తాజాగా విశాఖ జిల్లాలో ఇలాంటి ఘటనే మరొకటి వెలుగులోకి వచ్చింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… విశాఖ జిల్లా చిన గంత్యాడకు… చెందిన యువతి ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకుంది. రెండవ భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇండియన్ ఆర్మీ ఉద్యోగి ప్రసాద్ గత ఏడాది డిసెంబర్ మాసం లో కిలాడి లేడీ ని పెళ్లి చేసుకున్నాడు. అనంతరం ఆమెను లక్నో కు తీసుకు వెళ్ళాడు.

అక్కడే బంగారు ఆభరణాలు మరియు ఇతర వస్తువులను కొని పెంచుకుని దశలవారీగా ఏకంగా 90 లక్షల వరకు… ఆ ఆర్మీ ఉద్యోగి టోపీ పెట్టింది ఈ కిలాడి లేడి. ఇక పెళ్లయిన మూడు రోజుల తర్వాతే ఆ యువతి ప్రెగ్నెంట్ అన్న విషయం బయటపడింది. దీంతో… ఆ యువతి బండారం బయటపడింది. ప్రస్తుతం ఆ యువతి పరారీలో ఉన్నట్లు సమాచారం. ఇక ఈ విషయం బయటపడటంతో… బాధితులు అందరూ పోలీసులను ఆశ్రయించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version