హాస్ట‌ల్‌లో నీళ్లు లేవ‌ని.. విద్యార్థినిల జుట్టు క‌ట్ చేయించింది.. ఆ ప్రిన్సిపాల్‌.. దారుణం..!

1205

హాస్ట‌ల్‌లో నీటి కొరత ఉంటే ఎవ‌రైనా ఏం చేస్తారు. అందుకు ప్ర‌త్యామ్నాయ ఏర్పాట్లు చేస్తారు. కానీ.. ఈ ప్ర‌భుత్వ పాఠ‌శాల హాస్ట‌ల్ ప్రిన్సిపాల్ మాత్రం విద్యార్థినిల జుట్టు క‌ట్ చేయించింది.

జుట్టుకు నూనె రాయ‌డం, దువ్వ‌డం, త‌ల స్నానం చేయడం.. ఇదంతా దండ‌గ ఖ‌ర్చు ఎందుక‌ని చెప్పి ఒక సినిమాలో కోట శ్రీ‌నివాస రావుకు గుండు కొట్టించుకొమ్మ‌ని హీరో రాజేంద్ర ప్ర‌సాద్ స‌ల‌హా ఇస్తాడు.. చూశారు క‌దా. అయితే ఇప్పుడు ఆ ప్రిన్సిపాల్ చేసిన ప‌ని కూడా అచ్చం అలాగే ఉంది. నీటి కొర‌త ఉంద‌ని చెప్పి అమ్మాయిల‌కు జుట్టు క‌ట్ చేయించింది. అవును, నిజంగా ఈ సంఘ‌ట‌న అంద‌రికీ షాక్ కొట్టేలా చేసింది. ఇంత‌కీ అస‌లు విష‌యం ఏమిటంటే…

principal scissors girls hair because of water problem

మెద‌క్ జిల్లా కేంద్రం ప‌రిధిలో ఉన్న ఓ గిరిజ‌న మినీ గురుకుల పాఠ‌శాల‌లో 1 నుంచి 6వ త‌రగ‌తి వ‌ర‌కు మొత్తం 180 మంది విద్యార్థులు చ‌దువుకుంటున్నారు. అయితే అక్క‌డ నీటికి బాగా కొర‌త ఏర్ప‌డింది. దీంతో నీటి వాడ‌కాన్ని త‌గ్గించేందుకు ఆ పాఠ‌శాల హాస్ట‌ల్‌లో ఉంటున్న విద్యార్థినిల జుట్టును ప్రిన్సిపాల్ అరుణ క‌త్తిరింప‌జేసింది. సాధారణంగా అమ్మాయిలకు జుట్టు ఎక్కువగా ఉంటుంది క‌నుక త‌ల‌స్నానం చేసేందుకు నీరు ఎక్కువ‌గా అవ‌స‌రం అవుతుంది. అయితే ఇదే నెపంతో ఆ ప్రిన్సిపాల్ ఆ పాఠ‌శాల‌లోని అమ్మాయిల‌కు జుట్టు క‌ట్ చేయించింది.

కాగా ఈ విష‌యం తెలుసుకున్న విద్యార్థినిల త‌ల్లిదండ్రులు ప్రిన్సిపాల్ అరుణ‌ను నిల‌దీశారు. అమ్మాయిలు జుట్టును క‌ట్ చేసేందుకు ఎవ‌రు ప‌ర్మిష‌న్ ఇచ్చారంటూ వారు ఆమెపై మండిప‌డ్డారు. ఇక ఈ విష‌యంపై విద్యాశాఖ అధికారులు స్ప‌దించాల్సి ఉంది. ఏది ఏమైనా.. బాధ్య‌త‌గల ఓ ఉపాధ్యాయురాలు అయి ఉండి ఇలా ఏమాత్రం ఆలోచించ‌కుండా విద్యార్థినిల జుట్టు క‌ట్ చేయించ‌డం.. నిజంగా అమానుష‌మ‌నే చెప్పాలి..!