సౌత్ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ ఇప్పుడు మరొకసారి తన ఓరచూపులతో కుర్రాళ్ల మతులు పోగొడుతుందని చెప్పవచ్చు. చీర కట్టులో వయ్యారాలు ఒలకబోస్తూ మరొకసారి యువతను ఆకట్టుకుంటుంది ప్రియా వారియర్.. తాజా ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ గా మారాయి. ఈమె గార్జియస్ లుక్ కి యువత సైతం చూపు తిప్పుకోలేకపోతున్నారు.. అంతేకాదు ఆమె అందానికి ముగ్ధులై.. లవ్ ప్రపోజ్ చేస్తున్నారు. గ్లామర్ లేడీ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఇకపోతే సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన మొదట్లోనే కన్ను గీటి ప్రేక్షకులను పడేసిన ఈమె ఇప్పుడు అంతకుమించి అన్నట్లుగా అందచందాలతో ఉర్రూతలూగిస్తోంది.దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్న ఈమెకు అదృష్టం మాత్రం కలిసి రావడం లేదు .ఇటీవల ఈమె నటించిన ఒరు ఆధార్ లవ్ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. సినిమాలలో సక్సెస్ కాకపోయినప్పటికీ ఇలా వరుసగా గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ మరింతగా పాపులారిటీ దక్కించుకుంటుంది ఈ ముద్దుగుమ్మ.
ప్రస్తుతం అందాల ఆరబోతనే టార్గెట్ గా పెట్టుకున్న ప్రియా ప్రకాష్ వారియర్ తన అందాలను కెమెరాకు వదిలేసి హాయిగా గ్లామర్ షో చేస్తూ సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ను పెంచుకుంటుంది. ఇక 2018లో రావాల్సిన శ్రీదేవి బంగ్లా సినిమాపై కోర్టు ఆంక్షలు విధించిన నేపథ్యంలో 2019లో వచ్చిన ఓరు ఆధార్ లవ్ తో వచ్చింది కానీ మెప్పించలేకపోయింది. ఇక ఇప్పుడు ఇలా గ్లామర్ షో చేస్తోంది ఈ మధ్యకాలంలో మీకు తెలుగులో కూడా అవకాశాలు వస్తున్నాయని సమాచారం. మరి ఇకనైనా తన కెరియర్ను ముందుకు తీసుకెళ్తుందా లేక తన అందాలతో గ్లామర్ షోకే పరిమితం అవుతుందా అన్నది చూడాలి.