లంగ్స్ నే కాదు రక్తానాళాలను దెబ్బతిస్తోంది….కరోనాలో కీలకమైన ప్రోటీన్ల గుర్తింపు

-

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 25 కోట్లు దాటింది. ఇన్నాళ్లు మనిషి ఉపిరితిత్తులపై ప్రభావం చూపిస్తూ.. ఊపిరిని ఆపేస్తున్నాయి. తాజా అధ్యయనాల్లో రక్త నాళాలపై కూడా తీవ్ర ప్రభావం చూపిస్తూ గుండె పోటుకు కూాడా కారణమవుతోందని తేలింది. ఇందుకు సంబంధించి కరోనా వైరస్ లో 5 ప్రోటీన్లు కీలకంగా వ్యవహరిస్తున్నాయని ఇజ్రాయిల్ పరిశోధకులు కనుకున్నారు. కోవిడ్ ను ఎక్కువగా శ్వాసకోశ వ్యాధిగానే పరిగణిస్తారు కానీ వాస్కులర్ డిసీజ్ మరియు రక్తం గడ్డకట్టడం వంటి ప్రభావాలను కూడా చూపిస్తోంది.

సాధారణంగా శరీరంలోకి ప్రవేశించిన కరోనా వైరస్ తనను తాను ఉత్పత్తి చేసుకునేందుకు 29 రకాల ప్రోటీన్లను ఉత్పత్తి చేస్తుందని.. వాటిలో 5 ప్రోటీన్లు రక్త నాళాలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయని టెల్అవీవ్ సైంటిస్టులు గుర్తించారు. రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టేంటేలా చేస్తున్నామని తెలిపారు. ఎండోథెలియల్ కణాలను దెబ్బతీయడం ద్వాారా రక్తనాళాల స్థిరత్వం, పనితీరుపై ప్రభావం చూపిస్తున్నాయని వెల్లడించారు. దీంతో కరోనా పేషెంట్లలో గుండె పోటు ఎక్కువగా వచ్చేందుకు కారణమవుతున్నాయి ఈ 5 రకాల ప్రోటీన్లు.  

Read more RELATED
Recommended to you

Exit mobile version