పూణే బేస్డ్ స్టార్టప్ అభివృద్ధి చేసిన 3D మాస్కులు..!

-

కరోనా వైరస్ కారణంగా మాస్కు తప్పనిసరి అయిపోయింది.  పూణే బేస్డ్ స్టార్టప్ త్రీడి మాస్క్లను తీసుకు వచ్చింది. యాంటీవైరస్ గుణాల తో ఈ మాస్క్ ఉంటుంది సోమవారం నాడు ఈ విషయాన్ని అధికారులు చెప్పారు.

థింకర్ టెక్నాలజీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ చేత దీనిని డవలప్ చేయబడింది. వైరస్ కి వ్యతిరేకంగా ప్రభుత్వం చేస్తున్న పోరాటం లో భాగంగా, సైన్స్ & టెక్నాలజీ విభాగం యొక్క టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డ్ ఎంపిక చేసిన తొలి ప్రాజెక్టులలో వైరుసిడల్ మాస్క్ ప్రాజెక్ట్ ఒకటి.

ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న ఎన్ -95, 3-ప్లై లేదా క్లాత్ మాస్క్‌ల కంటే ఇది బాగా పని చేస్తుంది. ఈ విషయాన్నీ థింక్ర్ టెక్నాలజీస్ వ్యవస్థాపక-డైరెక్టర్ షితాల్‌కుమార్ జాంబాద్ పేర్కొన్నారు. దీని వలన మంచి ప్రొటెక్షన్ వస్తుంది అని కూడా అంటున్నారు.

ఈ వైరుసిడల్ మాస్క్‌లు బ్యాక్టీరియా ఫిల్టరేషన్ ని 95 శాతం కంటే ఎక్కువగా కలిగి ఉన్నాయని మొట్టమొదటి సారిగా 3 డి-ప్రింటెడ్ మాస్క్ కవర్ల కోసం మల్టీలేయర్ క్లాత్ ఫిల్టర్లను తయారు చేయడానికి కంపెనీ 3డి ప్రింటర్లను ఉపయోగించింది.

ఒక NGO ద్వారా, నాసిక్‌ లోని నందూర్‌బార్‌ లోని నాలుగు ప్రభుత్వ ఆసుపత్రులకు 6,000 వైరుసిడల్ మాస్క్‌లను ఆరోగ్య కార్యకర్తల ఉపయోగం కోసం పంపిణీ చేసింది. అదే విధంగా బెంగళూరులోని బాలికల పాఠశాల మరియు కళాశాలకు కూడా ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version