భారత రాజ్యాంగాన్ని మార్చడం సాధ్యమేనా అనేది రేవంత్ రెడ్డి చదువుకుని ఉంటే తెలిసేదని బిజెపి మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావు చెప్పారు. మెదక్ బిజెపి జిల్లా పార్టీ కార్యాలయంలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజ్యాంగాన్ని మార్చడానికి బీజేపీ సర్జికల్ స్ట్రైక్ చేసే కుట్ర చేస్తుందని 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మోడీ మారుస్తాడని రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు.
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మళ్ళీ పుట్టిన రాజ్యాంగాన్ని మార్చడం సాధ్యం కాదని స్వయంగా మోడీ చెప్పిన విషయాన్ని ప్రజలకి ఆయన గుర్తు చేశారు రాజ్యాంగ సవరణ మాత్రమే చేస్తారని అది ఇప్పటి దాకా 106 సార్లు మీ కాంగ్రెస్ పాలనలోనే జరిగిందన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని సూచించారు.