వాల్ కొడుకు మరో వాల్ అయ్యాడు… ద్రావిడ్ కొడుకు డబుల్ సెంచరి…!

-

టీం ఇండియా బ్యాటింగ్ దిగ్గజం, వాల్ ద్రావిడ్ కుమారుడు సమిత్ ద్రావిడ్ బ్యాటింగ్ తో అదరగొట్టాడు. కష్టాల్లో ఉన్న జట్టుని తన బ్యాటింగ్ తో వీరోచిత పోరాటం చేసి జట్టుని ఆదుకున్నాడు. వివరాల్లోకి వెళితే తాజాగా జరిగిన అండర్ -14 రాష్ట్ర స్థాయి మ్యాచ్‌లో సమీత్ డబుల్ సెంచరీ సాధించాడు. అండర్ -14 ఇంటర్ జోనల్ టోర్నమెంట్‌లో ధార్వాడ్ జోన్‌పై వైస్ ప్రెసిడెంట్ ఎలెవన్ తరఫున 14 ఏళ్ల సమిత్ 201 పరుగులు చేశాడు. 256 బంతుల్లో 22 ఫోర్ల సాయంతో 201 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.

ఇక బౌలింగ్ లో కూడా మూడు వికెట్లు తీసి సత్తా చాటాడు. రెండో ఇన్నింగ్స్ లో 94 పరుగులు చేసి సత్తా చాటాడు. టాస్ గెలిచి వైస్ ప్రెసిడెంట్ ఎలెవన్ కెప్టెన్ సమిత్ ద్రవిడ్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మూడు పరుగులతో జట్టు తొలి వికెట్ కోల్పోయింది. ఒక దశలో, వైస్ ప్రెసిడెంట్ ఎలెవన్ మూడు వికెట్లకు 67 పరుగుల వద్ద ఇబ్బందుల్లో ఉంది, కాని సమిత్ మరియు శ్రేయాస్ మొహంతి నాల్గవ వికెట్ కి 146 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి ఇన్నింగ్స్ ని నిర్మించారు. మొహంతి భారి స్కోర్ కి ప్రయత్నిస్తుండగా…

అతన్ని 78 పరుగుల వద్ద భువన్ బి అవుట్ చేసాడు. 87 వ ఓవర్లో డబుల్ సమిత్ ని ధార్వాడ్ జోన్ కెప్టెన్ వీరజ్ హవేరి సమిత్ ద్రవిడ్‌ ని అవుట్ చేసాడు. వైస్ ప్రెసిడెంట్ ఎలెవన్ తొలి ఇన్నింగ్స్‌ను ఏడు వికెట్లకు 372 పరుగుల డిక్లేర్ చేసింది. రెండో ఇన్నింగ్స్ లో కూడా సమిత్ మంచి ప్రదర్శన చేసాడు. ప్రణవ్ అభిజిత్ భట్టాడ్‌తో కలిసి 156 పరుగుల తేడాతో అజేయంగా నిలిచాడు. కాగా ప్రత్యర్ధి జట్టు ఓపెనింగ్ బ్యాట్స్ మాన్ ఉత్కర్ష్ షిండే అర్ధ సెంచరీ సాధించినా, కాని అతని జట్టు 124 పరుగులకే చాప చుట్టేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version